పుట:MaharshulaCharitraluVol6.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

మహర్షుల చరిత్రలు


కంఠము, సింహోన్నతములు నగు భుజములు, శుభలక్షణములుగల నాసిక, వివిధభూషణములతో నొప్పు ఆజానుబాహువులు, లక్ష్మీయుతము, శ్రీవత్సాంకితము నగు విపుల వక్షఃస్థలము, గంభీరనాభి, గొప్ప ఉదరము, రత్నకాంచివంటి నడుము, మనోహరము లగు తొడలు, జంఘలు, వజ్ర యవాంకుశరేఖలు గల కోమలచరణములు గలిగి దేదీప్యమాను డగు శ్రీరామచంద్రుని మనసార ధ్యానించి, చేతులార బూజించి నోరార భజించి, పరమ సులభముగ మోక్షము నందవచ్చును. ఇంతకంటెను సులభోపాయ మిం కెక్కడను లేదు."

"దేవా ! వీనుల విందగు శ్రీరామకథ నాకు సంక్షేపముగా దెలుపగదవే" యని నేను ప్రార్థించితిని. నాకోరిక మన్నించి యాత డిట్లు తెలిపెను.

రామకథా సంగ్రహము

"వత్సా ! సంసారమగ్ను లగు సజ్జనుల నుద్ధరింప విష్ణుమూర్తి త్రేతాయుగమున సూర్యకులమున నాలుగు రకముల యాకారములతో జన్మించి పూర్ణాకృతి యగుతాను రాము డనుపేరు వడసెను. రాముడు తండ్రి యానతి దలదాల్చి లక్ష్మణసహితుడై విశ్వామిత్రునివెంట నరిగి తాటకను జంపి కౌశికుని యజ్ఞభూమినిజేరి మారీచునిగొట్టి సుబాహుని జంపి యహల్యాశాపవిమోచనము గావించి మిథిల కేగి శివధనుస్సు విరిచి సీతను బెండ్లాడెను. రామునకు బదునైదవ వత్సరము సీత కారవవత్సరము, పండ్రెండేండ్ల యైనపిదప దశరథుడు రామునకు యౌవరాజ్యాభిషేకము చేయదల పెట్టెను; అది కైకేయీ వరద్వయమున జరుగకపోగా, రాముని బదునాలుగేం డ్లరణ్యవాసము చేయుటకు, భరతుని యౌవరాజ్యము ననుభవించుటకు నేర్పరచెను.

రాము డంత సీతాలక్ష్మణసమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని యైదవనాడు చిత్రకూటము జేరి యందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను