పుట:MaharshulaCharitraluVol6.djvu/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

63

కచుఁడు పెరిగి పెద్దవాఁ డగుచున్న సమయముస శుక్రాచార్యుని మృతసంజీవనీ విద్యవలన రాక్షసులకు విజయము, దేవతలకుఁ బరాజయము కలుగుచుండెను, ఉపాయాంతరమున మృత సంజీవనీ విద్య గ్రహింపవలె నని నిశ్చయించుకొన్న దేవతల కందులకుఁ దగినవాఁడు లభింపఁ డయ్యెను. తుదకు బృహస్పతియనుమతిం గొని సురలెల్ల రుఁ గచుని బ్రార్థించి శుక్రాచార్యునికి శిష్యత్వము నెఱపి మృతసంజీవనీవిద్య పరిగ్రహించి రమ్మని పంపిరి. కచుఁడు దేవహితై షియై యేగి శుక్రాచార్యునికి మిగుల నిష్టుఁడై మెలఁగి యాతనికూఁతు రగుదేవయాని వలపునకు నిలయమై తుదకుఁ బోయిన పనిని సాధించుకొని వచ్చెను.

బృహస్పతి యిచ్చినమాట దాఁటుట

మరుత్తుఁ డనురాజు యజ్ఞము చేయఁ దలఁచి బృహస్పతికడ కేగి భయభక్తియుక్తుల నమస్కరించి తన యజ్ఞమునకు యాజకత్వము వహింపు మని ప్రార్థించెను. బృహస్పతి తన యంగీకారమును దెలిపి యజ్ఞసంభారములను సమకూర్చుకొన మరుత్తున కనుజ్ఞ యిచ్చెను. మరుత్తుఁడును సురగురువు తన యజ్ఞమును నిర్వర్తింప నంగీకరించె నని యపరిమితానంద మంది సర్వసంభారములు సమకూర్చుకొనఁ దొడంగెను. ఇంతలో అసూయాగ్రస్తుఁడగు ఇంద్రుఁ డివిషయ మెఱిఁగి గురువుకడ కేగి తానే యజ్ఞము చేయుదు ననియు నా యజ్ఞమున యాజకత్వము వహింపవలయునే కాని మానవుఁ డగు మరుత్తుని జన్నము నడపింప వల దని ప్రార్థించెను. శిష్యవత్సలుఁ డగుబృహస్పతి యాతని ననునయించి తాను మరుత్తుని యజ్ఞమునకుఁ బో ననియు, ఇంద్రుని యజ్ఞమునే నడిపింతు ననియు శపథము చేసెను.

ఇంతలో సర్వసన్నాహములు సమకూర్చుకొని మరుత్తుఁడు దేవ గురువునకు వచ్చి యజ్ఞ మారంభింపఁజేయు మని వర్తమాన మంపెను. దానికిఁ దాను రాఁజాల ననియు నింకొకనిం బిలిచి యజ్ఞము నడిపించుకొను మనియు బృహస్పతి మరుత్తునకు వర్తమాన మంపెను. బృహస్పతి ప్రతిజ్ఞాభంగమునకు మరుత్తుఁ డెంతయు వగచి కింకర్తవ్యతామూఢుఁడై