54
మహర్షుల చరిత్రలు
మునే పలుకవలయును. గాని యప్రియము పలుక రాదు వ్యర్థవివాదముల నుండియు కొండెములు చెప్పుగుణము నుండియుఁ జాలదూరముగా వైదొలఁగ వలయును. వేఁటకాఁడు పక్షికూఁతల నేర్చి పక్షివలెఁ గూయుచు వాని నేమఱుపాటునఁ బట్టునట్లు రాజు శత్రువులను బట్టవలయును. శత్రువు లోడిపోయినను రాజు వారి విషయమున నేమఱి
యుండరాదు. జయము సంశయమైన వేళల శత్రువులతోఁ దలపడరాదు. శత్రుబలమును సామదాన భేదోపాయములచేతనే సాధ్యమైనంత వఱకు సమయఁ జేయవలయును. మెత్తగ మాటాడుట నిర్దయతో దండించుట, అలసత్వము, శత్రువంచన నెఱుఁగలేకపోవుట ఈ నాలుగు రాజ్యనాశన హేతువులు. ఒక్కవిషయమున కొక్క మంత్రియే కాని పెక్కురుమంత్రు లుండరాదు. శత్రువులు బలవంతులై యున్నపుడు వారికి నమస్కరించినను దప్పులేదు. నానావిధముల నడవడి కలవడిన వాని యైశ్వర్యమువలె, నానావిధ చిత్తచాంచల్యముగలరాజు రాజ్యము నిలువనేరదు. రా జెంతబలవంతుఁ డై నను బెక్కురతో నొక్కసారి కలహింప రాదు."
మఱియొకప్పు డింద్రుఁడు బృహస్పతిని దుష్టలక్షణములను దుష్టుని దెలిసికొనువిధానమును తెలుపు మని కోరెను. బృహస్పతి యిట్లు తెలిపెను. "ఇంద్రా! పరోక్షమున దోషము లుగ్గడించుట, మంచిగుణముల కసూయపడుట, పరుల సుగుణములను వినలేక పెడమొగము పెట్టుకొనుట, అకారణముగ మాటాడకుండుట, తలపంకించుట, పెదవి విఱుచుట, ఆసంబద్ధముగ మాటాడుట, వ్యర్థ ప్రతిజ్ఞ లొనరించుట, ప్రతిజ్ఞ చేసిన విషయమును గూర్చి మరలఁ బ్రస్తావింపకుండుట మున్నగున వెన్నో దుష్టలక్షణములు గలవు. హితభాషణము, ప్రసన్నత, కృతజ్ఞతాగుణము, ఆనందము, తృప్తి, దయ, దానము, ధర్మము, సత్యము, మున్నగునవి శిష్టలక్షణములు. వీనికి విరోధగుణములే దుష్ట లక్షణములు."
బృహస్పతి వసుమనునకుఁ దెల్పిన రాజధర్మములు
వసుమనుఁ డనురాజు తొల్లి బృహస్పతి నాశ్రయించి రాజధర్మము లాతనివలన నెఱుంగఁ గోరెను, బృహస్పతి యాతనిం గరుణించి యిట్లు