పుట:MaharshulaCharitraluVol6.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

39


శిఖరమంతయెత్తు గలిగి అతిస్వచ్చ మైనతెల్లని మహామేఘమువలె నొప్పు మిగిలిన వృషభ వాహనము నెక్కి జగన్మాతాపిత లగుపార్వతీపరమేశ్వరులు విచ్చేయుచుండిరి. వారి దివ్యతేజము భూనభోంతరాళములు గ్రమ్మి కోటి సూర్యబింబము లుదయించిన ట్లయ్యెను. వెంటనే శివుని మాయచే నా తేజమంతయు నుపసంహృత మయ్యెను. పిదప సర్వసౌందర్యనిధు లగుపార్వతీపరమేశ్వరులు కాననై రి. వారి ననుసరించి దివ్యరూపు లగుననుచరు లుండిరి. బాలేందుకిరీటుఁడై తెల్లనిశరీర చ్చాయ వెలయ, ముగ్గురు సూర్యులట్లు ప్రకాశించు మూఁడు కన్నులతో, పినాకపాణియై, సర్పహారుఁడై శివుఁడు కాననయ్యెను. అతని కుడిప్రక్క హంసవాహనారూఢుఁడై బ్రహ్మయు, నెడమప్రక్క గరుడ వాహనుఁడగు విష్ణువు నుండిరి. పార్వతిప్రక్క మయూరవాహనుఁ డగుకుమారస్వామి యుండెను. వారియెదుటనంది యుండెను. స్వాయంభువాదు లగుమనువులు, భృగ్వాదులగు మహర్షులు, ఇంద్రాదు లగుదేవతలు వారిని బరివేష్టించి యుండిరి. మఱియు సకలపరివార సమేతుఁడగు సర్వేశ్వరునిగాంచి ఉపమన్యుధౌమ్యు లమితభక్తి నాతనికి సాష్టాంగ నమస్కారము లొనరించి వేదమంత్రములచే సహస్రనామములచే స్తుతించిరి.

పరమేశ్వరుఁ డుపమన్యుని భక్తి కెంతయు నలరియాతని నేదేని వరము కోరుకొను మనెను. ఉవమన్యువు నిత్య శివభక్తి, అతీతానా గతవర్తమాన సర్వవిషయ జ్ఞానము కోరుకొని "ఓ దేవా! గోక్షీరములు, క్షీరాన్నము వీనిపైఁ గల కాంక్ష కారణముగా సర్వలోకప్రభువవగు నీ దర్శనము లభించినది. కావున నాకే కాక నా వంశమువా రెల్లరకు గోక్షీర సమృద్ధి ననుగ్రహింపుము. న న్ననుసరించిన నా తమ్ముని ధౌమ్యుని గూడఁ గటాక్షింపు” మని ప్రార్థించెను.

పరమశివుఁడు పరితోష మంది " వత్సలారా ! మీరు దుఃఖవర్జితులై జరామరణశూన్యు లగుదురు. సర్వజ్ఞులు ప్రియదర్శనులు నగుదురు. అక్షయ మగు యౌవనము, అగ్ని సమాన మగు తేజము, మీకుఁ గలుగును. మీరున్న ప్రదేశములం దెల్ల గో సంపద్వృద్ధి, క్షీరసమృద్ధియై క్షీరసాగరమే యటఁ బ్రవహించును. కల్పాంతమున మీరు బంధువు