ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జైగీషవ్యమహర్షి
35
నికిఁ గావలసిన దేమైననున్నఁగదా కోరుట? ఏ కోరిక లేనివాఁ డే కోరిక కోరును? పార్వతీపరమేశ్వరు లెంత యత్నించిన నాతఁడు చలింపఁ డాయెను. పరమేశ్వరుఁడు పార్వతివంకఁ జూచెను. ఆమె జై గీషవ్యుని బలుకరించి కనికరించి తాను బడ్డకోపమునకు బాధపడకు మనెను. ఆతఁ “డమ్మా! కోపతాప ప్రేమశాపము లన్నియు నాకు సమానమే" యని పలికి భక్తితో వారిని వీడ్కొలిపెను. ఈ పరీక్షలో పార్వతీపరమేశ్వరు లోడిపోయిరి. జై గీషవ్యుఁడు గెలిచెను.*[1]
- ↑ *భారతము అనుశాసనికపర్వము.