పుట:MaharshulaCharitraluVol6.djvu/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతకేతుమహర్షి

109


గలదు. అది నీవు తీర్చకతప్పదు. గ్రుడ్డివాఁడు గ్రుడ్డివాఁడు కాని వాఁడు ఏకకాలముననేయైన మహాత్ముఁ డెవఁడో యాతనికే నీవు నన్నీయవలయును. అన్యున కీయవలదు” అని పలికెను. అందులకు దేవలుఁడు “బిడ్డా! నీకోరిక లోకవిరుద్దము. అంధుఁడై కానివాఁడు, అంధుఁడు కాక యైనవాఁడు-చిత్రమైన మాటలు. అట్టివానిని నీవే చూచుకొనుము. వేదవిదులు, ఆచారవంతులు, ధర్మపరులు, తపశ్ళీలురునగు వటువరులను నేను బిలిపింతును. నీ కోరిక ననుసరించి వారిలో నొక్కనిని నీవే యెంచుకొను” మని పలికెను. సువర్బల యట్లే యొనర్పు మని తండ్రికిఁ బెప్పెను.

దేవలమహర్షి తనశిష్యుల నెల్లరినిఁ బిలిచి "వత్సలారా ! జన్మకుల రూపగుణప్రపర్తనలచే, నుత్తములై వేదాధ్యయనపరులై, బ్రహ్మచర్య వ్రతనిష్ఠులై , తల్లిదండ్రు లుండి వివాహేచ్ఛ గలిగిన వటువరులను సగౌరవముగాఁ దీసికొని రండు. వారిలో నొక్కనిని నాపుత్రిక యగు సువర్చల పరిణయమాడు నని చెప్పి యందుల కంగీకరించిన వారినే తీసికొని రం” డని వంపెను. దేవల శిష్యు లాశ్రమముల కేఁగి సువర్చలావృత్తాంతము, దేవలునికోరిక యెఱిఁగించి పెక్కురు వటువరులను దీసికొని వచ్చిరి.

దేవలుఁడు వారిని సమాదరించి సువర్చలం బిలిచి "తల్లీ ! వీరు వేదవేదాంగవేత్తలు, విద్యాసంపన్నులు, సత్కులీనులు, సచ్ఛీల యుతులు, వివాహసంతానేచ్చ గలవారు. మహావ్రతు లగువీరిలో నొక్కనిని నీవు వరింపుము" అని పలికెను. అందచందములతో నలరారు నా యిందువదన, బంగారమువంటి యొడలికాంతులు విరాజిల్ల, విద్యావినయవివేకవతియై వా రెల్లరికి నమస్కరించి “వటువరులారా ! మీలో అంధానంధుఁ డేకకాలముననే యైనమహనీయుఁ డెవఁడైన నున్న నాతనిని నేను వరించెదను. అన్యులను వరింపఁజాలను, మన్నింపుఁ" డని పలికెను. ఆమెమాటలు విని పెక్కురు తబ్బిబ్బై "యిది మేమి? అంధుఁ డనంధుఁ డెట్ల గును? అనంధుఁడంధుఁ డెట్లగును ! కన్య లక్షణ వతియే కానీ, వక్రబుద్ధి యని యామెగొంతెమ