పుట:Maharshula-Charitralu.firstpart.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

మహర్షుల చరిత్రలు


నున్న సూర్యరశ్మి యను సంయమి కపిలుసకు వేదములయం దేభావమున్నదో యెఱుఁగఁ గోరి సూక్ష్మరూపమున నా గోవును బ్రవేశించి “మహర్షి వర్యా! వేదములు దాంభికత్వాపాదకము లని యతులు పల్కుదురు. నీవు నా యభిప్రాయముతో నుంటివా?" యని యడిగెను. అందులకుఁ గపిలమహర్షి వేదములయందు నా కాదరానాదర భావములు లేవు. కాని, సంసారు లెల్లరకు వేదవిహితాచారము వలయును. పాణి యువస్థము నుదరము వాణి యనునవి మూయరాని వాకిళ్ళు. వానిని మూయఁగల్గిన బుథునకుఁ దపోదానవ్రతాదులు గాని వేదప్రామాణ్యముకాని కావలసిన పనిలే " దని చెప్పెను. అంత స్యూమరశ్మి సంతసమున గోగర్భమునుండి బయటపడి కపిలునకు నమ స్కరించి 'సత్య మెఱుఁగఁగోరి యట్లు గోగర్భమునఁ జొచ్చి ప్రశ్నించితిని. మన్నించి వేదప్రామాణ్యమును గుఱించి నా మనశ్శాంతి కొఱకింకను జెప్పు' మని వేఁడుకొనెను. అంతఁ గపిలమహర్షి వాని భావమెఱిఁగి " వేదములే లోకమునకుఁ బ్రమాణములు. శబ్దబ్రహ్మ్మ పరబ్రహ్మలలో శబ్దబ్రహ్మము మూలమునఁ బరబ్రహ్మము గ్రహింప వచ్చును. బ్రాహ్మణు లుత్తములై వేదచోదితకర్మములం జేయుచు శాశ్వతపదము నందవచ్చును. వేదతాత్పర్యమరసి వేదితవ్య మెఱుఁగువారలే వేదజ్ఞులు. ఇట్లు కానివారు వేదపాఠకులు ; సర్వము వేద పరినిష్ఠితము. కావున, నేను వేదమానిత బ్రాహ్మణులకు సమస్క రింతు" నని పలికెను. ఈ మాటలు విని స్యూమరశ్మి యానందించి వెడలిపోయెను.[1]

కపిలమహర్షి పుండరీకు ననుగ్రహించుట

తొల్లి పుండరీకుఁ డను మహారాజు మృగయా వినోదార్ధము సపరివారుఁడై వనముఁ జొచ్చి యథేచ్చము మృగముల వేఁటాడి దప్పిగొని కపిల మహర్షి యాశ్రమ ప్రాంతమునఁగల సరోవరమునందు

  1. భారతము - ఆనుశాసనికపర్వము.