పుట:Maharshula-Charitralu.firstpart.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

మహర్షుల చరిత్రలు


దుర్వాసుని వివాహము

తిలోత్తమాసాహసికుల రతిక్రీడఁ గాంచిన దుర్వాసునకు సంసార వాంఛ జనింపఁగా నౌర్వ మహర్షి కొమా రెయగు కందళి నాతఁడు వివాహమాడ నెంచెను. ఔర్వుఁ డామె కోపిష్ఠిని యనియు నవివేకిని యనియుఁ జెప్పి యందుల కామెను మన్నింపు మనెను. దుర్వాసుఁ డంగీకరించి కందళిని వివాహమై యుచితభోగముల నందెను. కాని, తుద కామె గయ్యాళియై యాతని బాధింపఁ జొచ్చెను.

దుర్వాసుఁడు భార్యను భస్మము చేయుట

ఎంతకాలమైనను దనగుణము మార్చుకొనలేని కందళితో విసిగి వేసారి యొకనాఁ డామెయందు నిర్మముఁడై దుర్వాసుఁడు తీక్ష్ణముగాఁ జూచెను. వెంటనే యామె భస్మమైపోయి యొకసుందరి రూపమున నాకసమునఁ గాననై తన దోషమును క్షమింపుమని కోరి యదృశ్యమయ్యెను. దుర్వాసుఁడు తనయంతటివాని వివాహ మాడిన కారణమున నామె నామము భువిపై శాశ్వతముగ నుండునట్లు చేయఁ గదళీ జాతిని సృష్టించి యామె నామమును జిరస్థాయి నొనర్చెను.[1]

ఔర్వుఁడు దుర్వాసుని శపించుట

కొంతకాలమునకుఁ గూఁతునల్లునిఁ జూడఁ దలంపు గలిగి యౌర్వమహర్షి దుర్వాసునాశ్రమమునకు వచ్చి తనూజం గానక దివ్య దృష్టి నామెకు జరిగినగతిఁ దెలిసికొని దుర్వాసునిం జూచి "ఓరీ! నాకొమార్తె యవివేకిని యని చెప్పి మన్నింపుమని ముందేకోరితిని. దానికి నీ వొడంబడి వివాహమై యామెను భస్మముచేసి నన్నవమానించితివి ఈ కారణముచే నీవు సంబరీషుఁ డను రాజన్యునివలన

  1. బ్రహ్మవైవర్తపురాణము.