పుట:Maharshula-Charitralu.firstpart.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దత్తాత్రేయ మహర్షి

125


త్రేయ మహర్షి మహాయోగసంపన్నుఁడు. అతని కృపఁ గాంచినచో నీ యభిమతము సిద్ధించు" నని చెప్పి దత్తాత్రేయుని కటాక్షమున నింద్రుఁడు జంభాది రాక్షసులఁ జంపిన వృత్తాంతము నెఱిఁగించెను. కార్తవీర్యార్జునుఁడు బయలుదేఱి పోయి దత్తాత్రేయు నాశ్రమమున కరిగి యాతనికి నమస్కరించి భక్తితో ననుదినము నాతని పాదము లొత్తుచు మద్యమాంసాదు. లాహారముగాఁ గొనితెచ్చి యిచ్చుచుఁ జందన కర్పూరకస్తూరికాది సమస్త వస్తు ప్రదానముల నాతని చిత్తము రంజించునట్లు పూజించుచుండ నొకనాఁ డాతని యపానవాయువగ్ని హోత్రమై వచ్చి కార్తవీర్యార్జునుని బాహుద్వయమును మాడ్చివేసెను. మఱియు దత్తాత్రేయుఁ డనేకవిధముల నాతని హింసించెను. ఐన, నాతఁడు తనభక్తి విడువక పరమానందముతోఁ బరిచర్య చేయుచుండెను. దత్తాత్రేయుఁ “డోరీ! కాంతాలంపటుఁడను. మద్య పాయిని, నన్నేల సేవింతువురా?" యని యడుగఁ గార్తవీర్యార్జునుఁడు “మహాత్మా ! నీ వంతశ్శుద్దుఁడవు, అసంగుఁడవు. నీవు విష్ణుమూర్తివి. ఆమె పద్మ" యని కేలుమోడ్చి సంస్తుతించెను. దత్తాత్రేయుఁ డాతని భక్తికి సంతసించి యేమి కావలయునో కోరుకొనుమనెను కార్తవీర్యార్జునుఁ డంత వేయి హస్తములు, సమస్త భూమి పాలనసామర్థ్యము, సంగర విజయము, సిరీసంపదలు, ధర్మతత్సర బుద్దియు, శైలాకాశజల భూమిపాతాళములయందుఁ దనరథ మకుంఠితముగా నడచు శక్తి కోరుకొనెను. దత్తాత్రేయుఁడు వానికా వరము లొసఁగి యంతర్హితుఁడగుచు "నోరీ ! నీ రాజ్యమందెల్లెడల నీ బాహుళక్తి మూలమున ధర్మప్రతిష్ఠానము చేయుము. యజ్ఞయాగాదులొనరించు బ్రాహ్మణులకు సమస్త మిచ్చుచుండుము, మద్భక్తి యోగము నెల్లెడఁ జాటుచుండుము. నీ వెన్నండధర్మముగా మహర్షుల ఖాధింతువో యానాఁడే మరణింతువు సుమా" యని ప్రబోధించెను.