పుట:Maharshula-Charitralu.firstpart.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

109


చ్యవనుఁడాతని భావమెఱిఁగి తన కింద్రునితోఁ బని లేదనియుఁ దాను నర్మదా జలముల మునిఁగినపు డొక పెనుబామీడ్చుకొని వచ్చెననియుఁ దెలిపెను. ప్రహ్లాదుఁడు సంతోషించి "ఋషీంద్రా! నీ రాకవలన నేను బవిత్రుఁడనైతిని. నాపై దయయుంచి నీవు తిరుగని తీర్ధములు క్రుంకనినదులు నుండవు కానఁ దీర్థ పరమార్థమును బోధింపు"మని కోరెను.

చ్యవనుఁడు ప్రహ్లాదుని కిట్లనెను. “హరిప్రియా! నీవంటి విష్ణుభక్తుఁ డెందును లేఁడు, నీ ప్రశ్నముల కుత్తర మీయకుండు టెట్లు? చెప్పెదను వినుము. చిత్తశుద్ధిలేని తీర్థాటనము వ్యర్థము, మనస్సు నిర్మలము కావలయునే కాని గంగలో మునిఁగినంత మాత్రమున లాభము లేదు. తీర్థవాసము మహాకష్టము. అటఁ జేసిన పాపము లత్యధిక దుఃఖాకరములు. తీర్ధములందుఁ జేసిన పాప మే విధముగను నశింపదు. మఱియు సర్వతీర్థాటనముకంటె భూతదయ, సత్యము, శౌచము, ముఖ్యములు. ఇవి కలవారి పాదముల క్రిందనే సకల తీర్థములు వచ్చి వసించును. ఐనను నైమిశము, చక్రతీర్థము, పుష్కరము ఈమూఁడును సకలలోక శ్రేష్ఠములగు భూలోకతీర్థము"లని తెలిపెను. ప్రహ్లాదుఁడు చ్యవను సతిభక్తి వీడ్కొలిపి తీర్థయాత్రాచరణ శీలియై సపరివారముగ బయలు దేఱెను.[1]

చ్యవనుఁడు లవణాసురవధకుఁ గారకుఁ డగుట

మథుఁ డను రాక్షసుఁడు శివుని మెప్పించి యాతనిచే నజేయమగు శూలమును గ్రహించి యా శూలము తన యనంతరము తన కుమారునకుఁగూడ నుపయోగింపవలెనని కోరుకొనెను. శివుఁ డంగీకరించి యా శూలము చేత నుండఁగ శత్రువు మిమ్ముల జయింపఁజాలఙ డనియును శూలము లేక యాలము చేయుచో నందు మడియవచ్చు సనియును జెప్పి యంతర్హితుఁ డయ్యెను. మథుఁడు కుంభీనసి యను

  1. బ్రహ్మ వైవర్తపురాణము.