పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

183

ముప్పదియైదవ ప్రకరణము


. నుంతటను పూచి, ఆ సమస్త ప్రదేశమును సుగంధముతో నింపి వేసేను. ఈ తెల్ల గులాబులకు నాలుగు పత్రములు మాత్రమే యుండెను. కొన్ని చోట్ల మల్లి పువ్వులు సహితము సుగంధ దానము గావించుచుండెను. మధ్య మధ్య కొన్ని ఫలములు * [1]కెంపువలె నెర్రని దీప్తి వహించి యుండెను. నాతో నున్న భృత్యుడొకడు ఒక వనలత నుండి పుష్పిత మైన శాఖ నొకదానిని కోసి నాహస్తము నందుంచెను. నే నిదివర కేన్నడును అట్టి సుందరమైన పుష్పలతను చూచియుండ లేను. నా "నేత్రములు తెరవబడెను. నాహృదయము వికసితమయ్యెను.నేనా చిన్న చిన్న శ్వేత పుష్పగుచ్ఛముల పై నావిశ్వజనని యొక్క మృదుహస్త మును గాంచగల్గితిని. ఈ వనము మధ్య ఎవ్వరీ సమస్త పుష్ప సుగంధము ననుభవించువారు? ఎవ్వరు వాని సౌందర్యము తిలకించువారు? ఐనను ఆమె యెత ప్రేమతో నెంత జాగరూకతతో వాటికి సుగంధమునిచ్చి, లావణ్య మునిచ్చి, శిశిరకణములతో వాటిని సిక్తముగావించి, ఆలతపై నమర్చియుం డెను ! ఆమె కరుణను, కోమలత్వమును నాహృదయుమున ననుభవించితిని. ప్రభో ! ఈచిన్ని పుష్పముల పైనే నీకింత కరుణయు న్నచో మాపైనీ కెంత కరుణ యుండవలెను? “నీరుణ నాహృదయము నందును ఆత్మయందును ఎప్పటికీని శాశ్వతమై , స్థిరమై నిలచి యుండును. నా మస్తకము ఛేదింపబడినను, నాహృదయమునుండి మాత్రము నీకరుణ ఎన్నటికిని పోనేరదు; అంతసుస్థిరముగ, నంతగాఢ ముగ నీ ప్రేమ నా యాత్మయందు ప్రవేశించినది.” +[2] హఫీజ్ విరచితమైన యీ పద్యమును దినను తయు దారిపొడు గునను ఉచ్ఛైస్వనమున పఠించుచు సూర్యాస్తమయఘు వరకును ఆయన


.

N

  1. Strawberries.
  2. + హర్గీజం మెహరతో ఆజ్ లో హోగిలో జా నిరవత్ | అచునా మొహరతు ఆందగ్దిలోలా జాయగిరస్త్ కెగర్మెంసర్ మెహరత్ ఆస్థావరంద్