పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
62
మహాపురుషుల జీవితములుకాఁకలి యుపశమిల్ల దయ్యె. అప్పుడాయోగిని చైతన్యుఁడు రాధ మొదలగువారికిఁ గూడ నిట్లే వింతయాఁకలి కలిగెనని చెప్పి, కొన్ని గ్రంథ దృష్టాంతములఁ జూపి పలుపిండివంతలు కూరలు నన్నము కుప్పకుప్పలుగా నతనియెదుటఁ బెట్టించెను. రాసులకొలఁది పదార్థములఁ జూచుటచే నతనియాఁకలి క్రమక్రమంబుగ నుపశమిల్లి ప్రకృతిలోఁ బడెను. ఈయోగిని యతనికి యోగశాస్త్రము సమగ్రముగాఁ దానున్న కాలమున నేర్పెను.

ఇవ్విధంబున యోగిశాస్త్రమునఁ బరిపూర్ణుఁడై రామకృష్ణుఁడు వేదాంతము నభ్యసింపవలయునని తలంచుచుండఁగా నతనివద్దకు మహానుభావుఁడగు దిగంబర యోగి యొకఁడువచ్చెను. అతఁడుబీరెండ గాయునపుడును గొండ చిల్లివడ వానలు గురియునపుడును జెట్ల క్రిందనే కాని యిండ్ల తల దాఁచుకొనఁడు. ఊరబైటనేగాని గ్రామమున వసింపడు. పండ్లుపాలెగాని యన్నముతినడు. రామకృష్ణుఁడొకనాఁడు గంగయొడ్డునఁ గూర్చుండ నాయోగివచ్చి వానిని గుర్తెఱిఁగి బ్రహ్మజ్ఞానోపదేశము చేయవచ్చితినని చెప్పి యతనితోఁ గలిసి పదునొకండు మాసములుండెను. రామకృష్ణుఁడు సాటిలేని బుద్ధినిపుణత గలవాఁడగుటచే నాతఁ డుపదేశించిన బ్రహ్మవిద్య నతిస్వల్ప కాలమున నవలీలగా గ్రహించె. యోగి యాతనితెలివి కక్కజపడి "వత్సా! నేను నలువదియేండ్లుకష్టపడి నేర్చినదానిని నీవు నాలుగుదినములలో నేర్చితివి" యని యాదినము మొదలు వానిని శిష్యుఁడుగా నెంచక మిత్రుఁడుగా భావించెను. ఆయోగి తనవద్ద నిరంతరము నగ్నిహోత్రము నిలుపుకొని యదియె పరమపావనమని తలంచుచుండెను. ఒకనాఁ డాయగ్నిహోత్రమున నొకఁడు చుట్ట కాల్చుకొనపోగా యోగి తనయగ్ని మైలపడినదని వానిపైఁ గోపించెను. అప్పుడు రామకృష్ణపరమహంస యోగినిట్లని మందలించె. "అయ్యా! యీ