పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
61
రామకృష్ణపరమహంసనేలపైవైచి కాలరాచి దానిపై నుమిసి "ఇది గర్వమును హెచ్చించును. దీనికన్న ప్రాతఁగుడ్డపేలికలు మే"లని దానితో నేలయూడ్చి పారవైచెను. ఆదినములలో నతనికి నిరంతరము శరీరమంతయుమంట లెత్తెచు వచ్చెను. అందుచేత నతఁడు గంగలోఁ గంఠములోతు నీళ్ళలో దిగి తరుచుగ నిలుచుచు వచ్చెను.

ఇట్లుండ నామహాత్మునియొద్ద కొకయోగిని వచ్చెను. ఆమె యూరెయ్యదియో యెవ్వరెఱుంగరు. ఆమె కనేకపురాణంబులు కంఠపాఠముగ వచ్చును. వాదములుచేసి యెంతెంతపండితులనైన నవలీలగ గెల్చెడు ప్రజ్ఞ గలది. ఒకయాఁడుది వచ్చి తనకుఁ గొంత విద్య నేర్పునని దేవిసమాధిలో నతనితో నొక్కమారు చెప్పెను. చెప్పిన చొప్పున దీర్ఘ కాయము స్ఫురద్రూపముగల యా యోగిని వచ్చి రామకృష్ణు నానవాలుపట్టి "నేను నీకొరకే వెదకుచున్నాను. కనఁబడితివా" యని వానిం బలుకరించి యాతనితోఁ గలిసి కొంత కాల మచ్చట నుండెను. రామకృష్ణుని శరీరమంతయు భగభగ మండుచుండుటచే నతఁడామెను కారణ మడుగ నామె భగవద్భక్తుల కందఱకు శరీర మట్లే మంటలెత్తు ననియు నిట్లే నాలుగువందల యేండ్లక్రిందట శ్రీచైతన్యునకును బూర్వకాలమున రాధాదేవికిని భగవంతునిపైఁ గల యనురాగముచే దేహతాపము గలిగె ననియును జెప్పి తనమాటలు సత్యములని ఋజువుచేయుటకు వైష్ణవ పురాణములందుప్పించి యందుఁబ్రమాణములం గనఁబరచి నమ్మించి రామకృష్ణునిమేన మంచిగంధము మూఁడుదినములు పూయించి పూలదండలు మెడనువేయించి యట్లే చైతనుని యొక్కయు రాధయొక్కయు తాపమడఁగెనని చెప్పెను. ఈశ్యైత్యోపచారముచే నద్భుతముగరామకృష్ణుని మేనుచల్లఁబడెను. ఈమంటలడఁగిన వెనుక నతనికిమితి లేనియాఁకలిబాధ కలిగెను. ఎంతయన్న మెన్ని మారులుతిన్న నతని