పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
[8]
57
రామకృష్ణపరమహంసకోవెలలో నొకటి. ఆయాలయమునకు రామకృష్ణునియన్న యర్చకుడుగా నేర్పడెను. ఆలయప్రతిష్ఠజరిగినదినమున నిరువది వేలమంది కన్నప్రదానము జరిగెను. గుడికట్టించిన యామె శూద్రస్త్రీ యగుటచే నామె కట్టించిన యాలయమున భుజించుట యశాస్త్రీయమని రామకృష్ణుడంత యన్నప్రదానము జరుగుచున్న యా యాలయమున భుజింపక సాయంకాలమువఱ కుపవాసముండి కొంచె మటుకులు కొని తిని రాత్రి కలకత్తాకుఁ బోయెను. తరువాతఁ గొన్ని నాళ్ళకు సోదరుఁడు వచ్చి తనవద్ద నుండుమని బ్రతిమాలుటచేఁ దవయన్నము తాను గంగయొడ్డున వేరే యొండుకొందునని చెప్పి యన్న నొప్పించి యతనితోఁ గలసియుండుటకుఁ బోయెను. అట్లు కొంతకాలము జరుగ సోదరునకు శరీరమునం దనారోగ్యము గలుగుటచే రాణి రాసమణి యొక్క యల్లుఁడగు మథురనాథుఁడు రామకృష్ణునే కోవెల కర్చకుఁడుగా నియమించెను.

అతఁ డాపనింబూని యనుదినమును దక్షిణేశ్వర స్వామిని శ్రీ కాళికా దేవినిఁ బూజించుచుండఁ గాళియం దత్యంతభక్తి యాతనికి నెలకొనియె. పూజానంతరమున రామకృష్ణుఁడు దేవీ విగ్రహమువద్ద గూర్చుండి కొడుకు తల్లియొద్ద మా రాముచేసి యడిగినట్లు 'అమ్మా ! పలుకవే నాగతియేమి చెప్పితివే' యని పిలుచుచు నెడ తెగక ప్రార్థించు చుండును. ఆదేవి తన మాతయనియు జగన్మాతయనియు నతఁడెంచుచు తాను నివేదన చేసిన యాహార మామె నిజము గాభక్షించుచున్న దనుకొనెను. ప్రార్థించుటయేగాని యాతఁ డెన్నఁడు రెండవపని చేయ కుండుటచేఁ వాని బంధుగు లతఁడు వెర్రిధోరణిలోఁ పడినాఁడని నమ్మి పెండ్లి చేసినచోఁ గొంతవఱకు దృష్టి మరలు ననుకొని వివాహముఁ దలపెట్టిరి. పెండ్లి చేయుటకుఁ దనవారుఁ దలపెట్ట నతఁడు తనకు రామచంద్రముఖోపాధ్యాయుఁడను నొక బ్రాహ్మణుని కూఁతురు శారదా