పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/384

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తండాళం గోపాలరావు

323

సంతోష సమయమున నాయానందమును దెలియజేయకుండుటకు నీపురోభివృద్ధి గోరకుండుటకు నామనసొప్పినది కాదు".

అది మొదలు గోపాలరావుయొక్క జీవిత మంతయు విద్యాశాఖలోనే గడుపబడెను. అందు జాల భాగము కుంభకోణ కళాశాలలోనే జరిగెను. కుంభకోణ కళాశాలయొక్క కీర్తి యిద్దఱివల్ల దేశమంతట వ్యాప్తమైనది. అందొకడు పోర్టరుదొర రెండవ యతడు గోపాలరావు. ఆకళాశాలలో నింగ్లీషుభాష గణితశాస్త్రము విద్యార్థులకు బోధించుభారము చాలవరకు గోపాలరావుమీదబడెను. దక్షిణ హిందూస్థానమున నాంగ్లేయ విద్యా ప్రాబల్యమునకు బ్రథమ పురుషుడైన పవెలుదొర గోపాలరావును మించినవారు సాధారణముగ నుండరని పలుమారు చెప్పెను. 1870-71-72 సంవత్సరములలో దొరతనమువారును గోపాలరావును గొంతకాలముపాఠశాల పరీక్షాధికారి (ఇనస్పెక్టరు)గా నియమించిరి. ఈ యుద్యోగము తెల్లవారికేగాని నల్లవారి కిచ్చెడు వాడుక పూర్వము లేదు. అట్టిగొప్ప యుద్యోగము స్వదేశస్థులలో మొట్టమొదట గోపాలరావునకే యిచ్చిరి. ఆయుద్యోగములోనుండి గోపాలరావు పాఠశాలలో నేర్పబడు విద్య మిక్కిలి యుపయుక్తముగా నుండునట్లు చేయుటకై పాటుపడెను.

చెన్నపురి దొరతనమువారు కూడ స్వదేశస్థుడు పాఠశాలా పరీక్షాధికారిగా నుండదగునో లేదో యని మొదట సంశయించి యాయుద్యోగము మాయన కిచ్చిరి. ఆయన మూడేండ్లు యధికారము జేయునప్పటికి దొరతనమువారు సంశయ నివృత్తులై గోపాలరావు పని మిక్కిలి నేర్పుతో జేసెననియు స్వదేశస్థు లీ యుద్యోగమునకు దగుదురనియు వ్రాసిరి. చెన్నపట్టణపు యూనివరిసిటీవారు వాని సామర్థ్యమును మెచ్చి యాయననొక ఫెల్లోగా జేసిరి.