పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/385

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
324
మహాపురుషుల జీవితములు

1872 మొదలు 74 వఱకు గోపాలరావు కుంభకోణము కాలేజీకి బ్రధానోపాధ్యాయుడై (ప్రిన్సిపలు) యుండెను. ఆ సంవత్సరములలో కుంభకోణ కళాశాలయొక్క పరీక్షాఫలితములు వెనుక పోర్టురుదొరగారి కాలములోకంటె నెక్కువ తృప్తికరములుగా నుండెను. ఆనాటిడైరక్టరు గవర్నమెంటు వారికి వ్రాయు సంవత్సర చర్యలో గోపాలరావు గూర్చి యీ క్రింద విధమున వ్రాసెను. "మన రాజధానిలో రెండవ కళాశాలకు బ్రథానోపాధ్యాయుడై గోపాలరావు తత్పదవికి దన యర్హతను సంపూర్ణముగ స్థాపించి యున్నాడు. కావున కాళీ వచ్చినప్పు డాయన కీయక తప్పదు. ఆయన సామర్థ్య మెట్టిదైనను పరీక్షాఫలితము లెంత తృప్తికరములుగా నున్నను మెచ్చవలసిన యధికారు లెంతగా మెచ్చినను దొరతనమువారు మాత్రము వానికా కళాశాలలోఁ బ్రథానోపాధ్యాయత్వము ఖాయముగ నీయజాలరైరి. 1878 వ సంవత్సరమున దొరతనము వా రాయనను కుంభకోణమునుండి చెన్నపట్టణ కళాశాలకు మార్చి యర్థశాస్త్రమందు దేశచరిత్రమందుఁ బండితునిగఁ జేసి తెల్లవారితో సమానమైన జీతముగల గౌరవస్థితికిఁ దెచ్చిరి. అంతటి విద్యావంతునకు నంతటి సమర్థునకు గవర్నమెంటువారా యుపకారముఁ జేసినందుకు జనులు సంతసింపక యదివరకే కుంభకోణము కళాశాలలోఁ బ్రథమ పండితోద్యోగ మీయ నందుకు జాలవగచిరి. తెల్ల వారితో సమానమైన యుద్యోగమీయక పోయినను జీతము వారితో సమముగ నిచ్చి మరియు గన్నీళ్ళుదుడుచుటకు దొరతనమువారు వానికి 'రాయబహుదూర'ను బిరుదమునిచ్చిరి.

గోపాలరావుయొక్క కటపటిదినములు చెన్నపట్టణము రాజకీయకళాశాలలోనె గడుపఁబడెను. 1883 వ సంవత్సరమున నతఁడు శక్తికి మించినపని చాలకాలమునుండి చేసినందున దారుణజ్వరపీడి