పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/324

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
271
సి. వి. రంగనాథశాస్త్రితప్పక యతఁడు గొప్పవాఁడనుకొని తీరవలయును. అతని ఫాలము మిక్కిలి విశాలమైయుండెను. అతఁ డెన్ని వేలమందిలో గూర్చున్నను వానిముఖవర్చ స్సందఱకు దర్శనీయమై గంభీరమై కానఁబడుచు వచ్చెను. అతని కఠధ్వని గంభీరమై యెల్లవారిని విధేయుల జేయునట్లుండును. ఏవిషయమందైన నభిప్రాయభేదము వచ్చినప్పు డతఁడు ప్రతిపక్షుల హేతువులువిని తన యభిప్రాయమును మార్చుకొనును. మంచి సబబులుచెప్పి యతఁడు తరుచుగ నితరులఁ దనతో నేకాభిప్రాయులఁ జేయుచుండును. అతని ప్రవర్తన మంతయు గడియారము వలెనే జరుగుచుండును. అనగాప్రతిదినము బ్రతికార్యమునకు నతఁడు కొంతకాలమునేర్పరచి యాపని యాకాలమందె సరిగ జేయుచుండును. అతని నెఱిఁగినవారు గడియారములో నెన్నిగంటలైనదో తెలిసికొనక్కర లేదు. రంగనాథశాస్త్రి యాసమయమున నేపని చేయుచుండునో యాపని జ్ఞప్తికిఁదెచ్చుకొనినయెడల కాలము తెలియును. అతఁడు దేహపరిశ్రమయందు మిక్కిలి నిష్టకలవాఁడై ప్రతి దినము ప్రాతఃకాలము నాలుగుమొద లైదుగంటల వఱకు హిందూ దేశపు కసరతు తప్పక చేయుచుండువాఁడు. వ్యాయామము ముగిసిన వెనుక నైదు మొద లేడుగంటలవఱకు గుఱ్ఱపుసవారు చేయుచుండును. గుఱ్ఱముమీఁద నతఁడు నిశ్చలుఁడై కూర్చుండిన యొప్పిదముఁ జూచి తీరవలయునని తెల్లవా రభిప్రాయపడుచు వచ్చిరి. ప్రతి దినము సాయంకాలమాయన చాలదూరము కాలినడకను షికారు పోవు చుండును. ఇట్లుదయము సాయంకాలము తప్పక దేహపరిశ్రమ చేయుటచే రంగనాథశాస్త్రి మంచిదేహారోగ్యముఁ గలిగియుండి యొక్కనాడైన జబ్బుపడి మంచముమీఁద బండుకొనియెఱుఁగడఁట. దినమున కాఱుగంటలు రంగనాథశాస్త్రి చదువునకై వినియోగించుచు వచ్చెను. ముసలితనమందుఁ గూడ చదువుకొనుచు బుస్తకము చేతఁ