పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
270
మహాపురుషుల జీవితములు

1867 వ సంవత్సరమున రంగనాధుఁడు పచ్చయప్ప మొదలియారుగారి ధర్మకార్య నిర్వాహణసభలో నొక సభ్యుఁడుగ నియమింపఁబడి యందు మిక్కిలి శ్రద్ధతో బనిచేసెను. 1877 వ సంవత్సరమున ఢిల్లీదర్బారు జరిగినప్పుడు గవర్నరు జనరలుగారు రంగనాథశాస్త్రి నక్కడకు సగౌరవముగారావించి యొకపతకమును యోగ్యతాపత్రికను స్వయముగా వానికిచ్చి పంపిరి. ఇట్లు సర్వజనశ్లాఘనీయముగ దొరతనమువారివద్ద కొలువుచేసి రంగనాథశాస్త్రి 1880 వ సంవత్సరం ఫిబ్రేవరు 16 వ తారీఖున పింఛను పుచ్చుకొని యుద్యోగము మానుకొనెను. అతడు చేసిన ప్రశస్తసేవను గుర్తెఱింగి దొరతనమువారు వానిని జెన్నపట్టణపు గవర్నరుగారి యాలోచనసభలో సభ్యుఁడుగ నేర్పరచిరి. ఆసంవత్సరమే జూలై నెలలో హైదరాబాదు దివానుగారగు సర్. సలారుజంగుగారు రంగనాథశాస్త్రిని నెలకు 2,500 రూపాయలజీతము మీఁద తనకు ప్రయివేటు శక్రటరిగా నుండుమని కోరిరి. కాని శాస్త్రిగారు ధనమే పావనమని యెంచక తన జీవిత కాలములో సాయంసమయమును విద్యావ్యాసంగముల లోను దన మనుమల విద్యాబోధనములలోను గడుపఁదలఁచి యా యుద్యోగ మక్కర లేదని వ్రాసెను. కాని యతఁడు చేయఁదలఁచిన రెండుకార్యములు నిర్వహించు నదృష్టమతనికి లేకపోయెను. మృత్యు దేవత మనుష్యులను గొప్పతనమునుబట్టి గౌరవింపదుగదా ! పాప మాయన 1881 వ సంవత్సరం జూలై నెల 5 వ తారీఖున గాల ధర్మము నొందెను.

రంగనాథశాస్త్రి సాధారణ మనుష్యులకంటె పొడగరి. అతని దేహదార్ఢ్యముజూచి తెల్లవారుసైతము మిక్కిలి విస్మితులగుచు వచ్చిరి. అతని దేహచ్ఛాయ యించు మించుగ తెల్లవారి దేహచ్ఛాయవలెనే యుండును. వానిఁజూచినవా రందఱు