పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[30]

నవాబ్ సర్ సలార్ జంగు

233



డులో కృతకృత్యుఁడు గాకపోయినను స్వదేశరాజులలోనైన నెవరికిం జరుగని యఖండ గౌరవము తన కక్కడ జరిగినదని సంతుష్టి నొందెను.

అనంతర మతఁడు స్వదేశమునకుఁవచ్చి 1883 వ సంవత్సరము వఱకుఁ హైదరాబాదు సంస్థానమును న్యాయముగఁ బాలించెను. 1883 వ సంవత్సరమున విశూచిజాడ్యముచేత నతఁడుమృతినొందెను. మరణకాలమున కతనికి యేఁబదిమూడేండ్ల వయస్సు. వాని మరణమునకు వగవనివారు లేరు. హిందూ దేశస్థులు దుఃఖించిరని చెప్పుట యొకగొప్పకాదు. ఇంగ్లాండుదేశస్థులుఁగూడ బిట్టువగచిరి. విక్టోరియా రాణిగారు తత్కుమారుఁడు యువరాజుగారు మొదలగు ననేకులు వాని మరణమునకు శోకింపుచు తత్కుటుంబమునకు జాబులువ్రాసిరి. ఇండియా గవర్నమెంటువారు ప్రత్యేకముగా నొక గెజిటీలో నీక్రింది విషయమును వ్రాసిరి. "ఈ నెల 8 వ తేదీని హైదరాబాదు సంస్థానమునకుఁ మంత్రియగు సర్ సలారుజంగుబహదూరు విశూచిజాడ్యము వలన మృతినొందెనని తెలియఁజేయుటకు మాకు మిక్కిలి దుఃఖకరముగా నున్నది. అతని మరణముచేత నిండియా గవర్నమెంటువారికి విశ్వాసపాత్రుఁడగు మిత్రుఁడు పోయెను. నిజాము గారికి యోగ్యుఁడగు మంత్రిపోయెను."

సలారుజంగు పొట్టియుఁ బొడుగు కాని విగ్రహము కలవాఁడు. సుకుమారదేహుఁడు కాని గంభీరాకారముగలవాఁడు వేష భాషలలో నతఁడు సామాన్యుఁడువలె నుండును. గొప్పదర్బారులు తీర్చినప్పుడు తప్ప తదితరసమయముల నతఁడు నగలుదాల్చువాడుకాఁడు. అతనిఁ పద్ధతులన్నియుమంచివి. అతఁడు జనులకుసులభుఁడు. తోఁటలువేయించుట యతనికి యెక్కువయిష్టము. అతనికి యూరోపియనుల సహవాసమే యెక్కువయిష్టము. వానియునికియు దొరలపద్ధతి ననుసరించియే.