పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
216
మహాపురుషుల జీవితములుకాలమున బొంబాయినగరమునకు షరీపుగ నుండుమని యతనినిగోరిరి. కాని యితఁడు రెండుపనులు జేయుటకుఁ వీలు లేదని యాయుద్యోగము వద్దని చెప్పెను. 1876 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువుగారు బాలురపాఠశాలలోఁ జదువవలసిన పుస్తకములు నిర్ణయించుట కొక్కసభ కూర్ప దలఁచి యందు మండలీకు నొక సభికునిఁగా నియమించెను. కాని యతఁడు శరీరదౌర్భల్యము చేత నందుండుటకు వీలులేదని మానుకొనెను. 1877 వ సంవత్సరమున విక్టోరియారాణిగారు చక్రవర్తి బిరుదము వహించినప్పుడు "హిందూదేశ మిత్రజ్యోతి" యనునర్థమువచ్చు సి. యస్. ఐ. యను బిరుదును దానితో నొక వెండిపతకమును దొరతనమువా రతనికిచ్చిరి.

మండలికుఁడు 1889 వ సంవత్సరము మేనెల తొమ్మిదవ తేదీని కాలధర్మనొందెను. ఆదినమునందే బొంబాయిమునిసిపాలిటీవారు సభగూడి విశ్వనాథనారాయణ మండలికుడు మునిసిపల్ కమీషనరుగా నుండియు జస్టీసుగానుండియు బొంబాయినగరమునకు జేసినమహోపకారమునకు గృతజ్ఞులై యతనిమరణమునకు విచారించిరి. అతనిమరణమునుగూర్చి శోకించుచు జనులు మహారాష్ట్ర దేశము నందంతటసభలు జరిపిరి. అతనికిసంఘ సంస్కరణము లేదుగాని వితంతువులకు దలగొరిగించుటయతఁడొప్పుకొనలేదు. పూర్వాచారములన్నియు నతనికిష్టములయినను విదేశములు మరలఁ గొన్ని కట్టుబాటులమీఁద సంఘమునఁ జేర్చుకొనవచ్చుననియతఁడు చెప్పుచువచ్చెను. అతనిభార్య యెల్లప్పుడు రోగిష్టియైయుండెను. అయినను మండలీకుఁడు సత్ప్రవర్తకుడై దయాళువై యామె కుపచారములు చేయించుచు నేకపత్నీ వ్రతస్తుఁడై కాలముబుచ్చెను. అతఁడు బంధువులకు చాలధనసహాయము జేసెను. భార్య కోరికమీఁద నామెయుం దాను వెండితోఁ దులాభారము దూఁగి యా సొమ్ము దానము చేసెను. ఆకాలమం దెల్లవిధముల నంతవాఁడు లేఁడని యెల్లవారు నంగీకరించిరి.


Mahaapurushhula-jiivitamulu.pdf