పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
215
విశ్వనాథ నారాయణ మండలికుఁడువిద్యార్థులకు బఠనీయ గ్రంథముగా నేర్పరుపఁబడెను. 1867 వ సంవత్సరమున నతఁడు హిందూ లా సంగ్రహమను నొకగ్రంథము నింగ్లీషున వ్రాసి దానికి గుజరాతిలో నర్థము వ్రాసెను. అదియే యిప్పు డనేకులు జదువుచుందురు. మఱియు నతఁడు కిండరుసులే దొరగారు రచియించిన సాక్ష్య శాస్త్రమును స్వభాషలోనికి మార్చెను. సివి లధికారము క్రిమిలధికారము కలక్టర్ల చేతులోనుండి తప్పింపవలసినదని యాయన యభిప్రాయపడి తద్విషయమున నాయన కొంతవ్రాసెను. ప్రాచీన శాసనాదులఁగూర్చి బొంబాయిలోనున్న యాసియాఖండ సంఘమువారియెదుట నతఁ డాఱుపన్యాసములు జదివెను. నీలబంధు ద్వాఖ్యానముతోనున్న యాజ్ఞవల్క్యస్మృతిని నిర్దోషముగా నత డచ్చు వేయించి దానికి నింగ్లీషున భాషాంతరీకరణము గావించి ప్రచురించెను. అది హిందూధర్మశాస్త్రమును గరతలామలకముగ దెలుపునని యా కాలమున నెల్లవారు గొనియాడిరి. ఆగ్రంథములకు మండలీకుఁడు చక్కని పీఠికవ్రాసి దానిలోహిందూధర్మ శాస్త్రముయొక్క చరిత్రము దానిస్వభావము నిర్వచించి స్మృతులను విభాగించి స్మృతి ప్రమాణములకు ననుగుణముగా కోర్టులిచ్చిన తీర్పులందుద హరించి భిన్నములగు నాచార వ్యవహారములను బేర్కొని యెల్ల విధముల గ్రంథ మత్యంతోపయుక్తమగునట్లు చేసెను. అతఁడు పత్రికాప్రవర్తకుఁడని కూడ నీవఱకుఁ జెప్పియుంటిని. అతఁడు "స్వదేశీయుల యభిప్రాయ" మనుపేర నొకయింగ్లీషు పత్రికను 1864 వ సంవత్సరమున స్థాపించి 1871 వ సంవత్సరమువఱకు బ్రకటించెను.

అతఁడుచేసిన దేశోపకారము నెఱింగియే దొరతనమువారు గూడ వానిని చాలగౌరవించిరి. అతఁడు స్కూళ్ళ యినస్పెక్టరు పని మానుకొన్నప్పుడు దొరతనము వారదివఱ కతనికిఁ నుద్యోగవశమున నిచ్చిన రావుసాహేబుబిరుదము యావజ్జీవముంచుకొన వచ్చునని యుత్తరువిచ్చిరి. గవర్నరుగారి యాలోచనసభలో సభికుఁడుగనున్న