పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
211
విశ్వనాథ నారాయణ మండలికుఁడుకక్కడకు బోయివాని పక్షము వాదించెను. మరియొకసారి కొంకణదేశమున రత్నగిరికిఁ బోవలసియుండి యక్కడ బొగయోడ దొరకకయుండుటచే ప్రత్యేకమొక పొగయోడ తన నిమిత్తము దెప్పించుకొని చాలసొమ్ము వ్యయముచేసికొని యాయూరు చేరెను.

అతఁడు న్యాయవాది శబ్దమును సార్థకముచేసినన్యాయవాది. వ్యాజ్యములుతనవద్దకు తెచ్చినవారికి రుసుమెప్పుడునీయ లేదు. అతడు తనకెంతంత ధనమిచ్చెదమన్ననుసరే యోడినవారిపక్షమున నెన్నడు పనిచేయువాఁడుకాడు. ఆ కాలమందు హైకోర్టులో నసలువ్యాజ్యముల విచారణకు నప్పీళ్ళవిచారణకుఁ గొంతభేదముండెను. అప్పీళ్ళ విచారణలోనున్నంత సులువు అసలు వ్యాజ్యములలో లేదు. అందుచేత రెండింటికి సమానమైన సౌకర్యములు సేయుమని మండలీకుఁడు జడ్జీలను వేడెను. వారట్టివిధముగా నందఱకుఁ జేయుట కిష్టపడక కావలసినయెడల మండలికునకును మఱియొక రిద్దరికి నుపకారము చేయుదుమనిరి. మండలీకుఁడు స్వప్రయోజనపరుఁడు గాకపోవుటచాఎ నందఱకు లేని సౌకర్యము తనకొక్కనికి నక్కరలేదని నిరాకరించె. 1884 వ సంవత్సరమున గవర్న మెంటు వకీలుగానుండిన నానాభాయి హరిదాసు హైకోర్టుజడ్జీగా నియమింపబడెను. అందుచే దొరతనము వారు మండలీకుని తమ వకీలుగా నియమించుకొనిరి.

మండలీకుని గొప్పతనము చాలధనము సంపాదించిన న్యాయవాది యనియేగాదు. అతఁడు బొంబాయిలో మునిసిపల్ కమీషనరుగా నుండెను. అదియునుగాక గొప్పసంస్కృత పండితుఁడు. మఱియు దేవభాషను జక్కగనేర్చి యందనేక గ్రంథములువ్రాసెను. కొంతకాలము వార్తాపత్రికలనుగూడ నడపెను. దొరతనమువారి శాసననిర్మాణ సభలోఁ జాలకాలము సభికుఁడైయుండెను. వేయేల!