పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

మహాపురుషుల జీవితములు

మీదఁ మిక్కిలియక్కసు బూనియున్న గురుమహారాజులు లదేసమయముగదా యని విదేశము వెళ్ళినందుకు వానికి వెలివేసి బహువిధముల బాధ పెట్టిరి. ఎన్ని బాధలు పెట్టినను మూల్‌జీ మేరువువంటి ధైర్యము గలవాఁడయి జడియక నిలచెను. ఇటులుండ నప్పటి బొంబాయిగవర్నరుగారు మూల్‌జీయొక్క సామర్థ్యమును, నీతిని, ధైర్యమును నెరిగినవా రగుటచే నొక స్వదేశసంస్థానమునకు వానిని దివానుగా నేర్పరచెను. ఉద్యోగస్థుడయి యున్న కాలమున, నతఁ డాపదవిలో దన్ను నియోగించిన దొరతనమువారికిని తనచేఁ బాలింపబడు ప్రజలకును సంతుష్టిగలుగునట్లు దేశము నేలెను. కాని యీ యుద్యోగమున నతఁడు చిరకాలముండలేదు. అచిర కాలములోనే యొక వ్యాధి సంభవించి యెట్ట కేలకు వానిం దనపొట్ట బెట్టుకొనియెను. ఈ సత్పురుషుని మరణమునకు బొంబాయి గవర్నమెంటువారు సయితము విచారించి తమ గెజటులో నా విచారమును తెలియపరచిరి. కృష్ణదాసు మూల్‌జీ సత్యము నిమిత్తము కష్టముల ననుభవించిన సూరశిఖామణి, సంఘసంస్కరణము నందితడు తనకు గల యభిమానము మాటలచేతగాక క్రియలచేతజూపి మొదటి నుండియు తన వర్తనమున నసందర్భములు లేకుండ నేకరీతిని నడపినవాడు. ఆ కాలపు బొంబాయి గవర్నరుగారే కాక యింక ననేకులు శ్లాఘాపాత్ర మగువాని చరిత్రమును మెచ్చుకొనుచుండిరి. సర్ రిచ్చర్డు టెంపిల్‌గారు తన కాలపు మనుష్యుల చరిత్రములను వ్రాయుచు నీతని గూర్చి శ్లాఘ్యమగు మాటలతో వ్రాసిరి.