పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదాసుమూల్జీ

191

యున్న భట్టియాలు వానిని దిట్టముగఁ గొట్టిరి. అందుచేత రాజభటుల సాహాయ్యము గైకొని యింటికిఁ బోవలసి వచ్చెను.

గురువు దాఖలుచేసిన ప్రతిష్టానష్టపు దావా హైకోర్టులో నలువదిదినములు విచారింపఁబడెను. న్యాయాధిపతియగు జోసఫ్ అర్‌నాల్డు దొరగారు మూల్జీ నేరస్థుఁడు గాఁడని తీర్పు చేయుటయేగాక యతఁడు లోకోపకారి యనియు నీతిస్థాపనము నిమిత్తము చాలధైర్యముజూపె ననియుఁ దమ తీర్పులలో వ్రాసిరి. ఆ కాలమున నమెరికా ఖండములో గొప్పయుద్ధములు జరుగుచుండుట చేజనులు కృషి వాణిజ్యాదుల యందు శ్రద్ధ విడిచినందున దూదిపంట యల్పమయ్యె. అమెరికా ఖండపు దూదియే యదివఱ కింగ్లాండునకు విస్తారముగా నెగుమతి యగుచుండెను. ఆ ఖండమునందు దూదిపంట యల్పమయినందున నింగ్లాండువర్తకులు హిందూదేశపు దూది మిక్కుటముగాఁ గొనగోరి బేరములిచ్చిరి. అప్పుడు మనదేశములోదూదివెల యెక్కువయ్యెను. అందుచేత మూల్‌జీ తన పూర్వపువృత్తిని మాని దూది వర్తకము చేసినచో మిక్కిలి లాభము వచ్చునని కృష్ణదాసు మాధవదాసనుపేర నొక వర్తకపు సంఘముపెట్టి వ్యాపారముచేయ నారంభించెను. విదేశముతో వాణిజ్యము సేయునప్పుడు వర్తకుఁ డా దేశమునకు బోవనిచో వ్యాపారము సరిగ జరుగదని కృష్ణదాసు పయనమయి యింగ్లాండునకుఁ బోయెను. కాని యంతశ్రద్ధతో నతడు వ్యాపారము చేసినను దైవవశమున దూదిబేరములలో ధరలు మిక్కిలి మందమగుటచే మూల్‌జీ స్థాపించిన వర్తకపు సంఘము నష్టము నొంది యంతరించెను. కాబట్టి మూల్‌జీ యింగ్లాండులో నుండవలసిన యవసరము లేక 1874 వ సంవత్సరమునకు మరలివచ్చెను. ధనలాభము లేదు సరిగదా యింగ్లాండు పోయినందుకు మూల్‌జీకి మరియొక యుపద్రవము సంభవించెను. చిరకాలమునుండి యతని