పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
189
కృష్ణదాసుమూల్జీవలయును. 3. చట్టములు నిర్మింపబడులోపున నీమహారాజుల శిష్యుడు కానివాఁడెవడయిన వారికి సమనులు చేయించినపక్షమున నట్టి వ్యవహారమునకుఁ గావలన ధనమంతయు శిష్యవైష్ణవులు పెట్టుకొనవలయును. 4. గురుమహారాజుల శిష్యుఁడగు వైష్ణవుం డెవండయిన వారిమీఁద చెడువ్రాతల వ్రాసినపక్షమున వెంటనే కులస్థులందఱు వానిని వెలివేయవలయును.

ఇట్లు వ్రాసి యా యొడంబడిక పత్రమును గురువులు శిష్యులందఱకు యధేచ్చముగ బంచిపెట్టిరి. ఆకాగితమునుజూచి మూల్జీ దానికి బానిసపత్రమని పేరుపెట్టెను. ఒడంబడక లెన్ని వ్రాసికొన్నను శిష్య జనులు చాలమంది దానిలో వ్రాలుచేయనందున మహారాజులు తమ యిచ్ఛాప్రకారము కృష్ణదాసును బహిష్కరింపఁ జాలరయిరి. ఇటులుండ 1860 వ సంవత్సరమధ్యమున సూరతు నగరమునుండి యొక మహారాజు బొంబాయి నగరమునకు విజయం చేసెను. వచ్చినకొన్ని నాళ్ళకె యాగురువునకును సత్యప్రకాశిక పత్రికాధిపతియగు మూల్జీకిని మతాచారములలో గొన్ని సందిగ్ధవిషయములనుగూర్చి చర్చజరిగెను. కృష్ణదాసడిగిన ప్రశ్నలకుఁ దగినయుత్తరములు చెప్పఁజాలక గురుమహారాజుగారు "శేషంకోపేన పూరయే" త్తను లోకోక్తి నిజముగ మహాకుపితులై మూల్జీనాస్తిక వాదములు చేయుచున్నాఁడనియు మతమునకు జెరుపుగావింపు చున్నాఁడనియు నిందారోపణము చేసెను. గురువులు తన కారోపించిన యీనీలాపనిందలకు మూల్జీ 1860 వ సంవత్సరము అక్టోబరు 21 వ తారీఖున ప్రకటింపఁబడిన సత్యప్రకాశికలో సహేతుకమయిన మంచి యుత్తరమిచ్చి యందు వేదములలో నుండి శాస్త్రములలోనుండి యెన్నోశ్లోకములనెత్తి వ్రాసి గురువులు చేసిన వాదము లప్రమాణికములని ఋజువుచేసి ప్రపంచము నీ గురుమహారాజులకంటె .......................