పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/224

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[24]
185
కృష్ణదాసుమూల్జీవ్యాసము వ్రాయుటమాని తన యభిప్రాయములు మారినవని మేనత్తతో జెప్పి సరిపుచ్చుకొన్న పక్షమున నతఁ డెప్పటియట్ల నామె యనుగ్రహమునకుం బాత్రుడయి యుండును. కాని కృష్ణదాసు అట్లు చేయువాఁడుకాఁడు. సంఘసంస్కరణాసక్తి వాని హృదయమునం దగ్నిహోట్రమువలె ప్రజ్వరిల్లుచుండుటచేత నతడు మిగుల ధైర్యము నుత్సాహము గలిగి తనునమ్మినది సరియని యా మార్గము నుండి తొలగనని చెప్పెను.

మిక్కిలి యవసరములగు నన్న వస్త్రములకే యతఁ డిబ్బంది పడుచుండుటచే నేదైన యుద్యోగము సంపాదింపఁ దలఁచి గోకులదాసు తేజపాలుగారి పాఠశాలలో నుపాధ్యాయత్వము సంపాదించి కొంతమనశ్శాంతి గలిగి సంఘసంస్కరణము నభివృద్ధి జేయుటకై పూనుకొనియెను. ఆ కాలమున బొంబాయిలో స్వదేశవార్తాపత్రికలు మిక్కిలి హీనస్థితిలో నుండెను. వానిని నడుపువారు తగినంతజ్ఞానము గాని లోకానుభవముగాని లేనివారయి యుండిరి. పారసీలు నడపు పత్రికలు తప్పులతడకలయి నీచ పదప్రయోగములు గలిగి గుజరాతి భాషలోను నింగ్లీషుభాషలోను బ్రకటింపఁబడుచువచ్చెను. ఈస్థితిని జూచి వార్తాపత్రికల దురవస్థను తొలగించుటకు విద్యావంతులు లోకోపకారులు నగు కొందఱు పారసీలు 'రాస్టుగాప్తర్‌' యను గుజరాతిపత్రికను బయలుతీసి నడిపింపఁజొచ్చిరి. దాని నసమానముగ జేయ వలయునని తత్ప్రవర్తకులు సంకల్పించుటచే కృష్ణదాసుకూడ వారికి సాయము చేయఁదలచి కొన్ని విషయములు వ్రాసి తాను పత్రికకు పంపుచువచ్చెను. కానియప్పుడప్పు డితరుల పత్రికకుఁదాను వ్రాసి పంపుచుండుటయు వారనుగ్రహించి తనవ్రాతలు పత్రికలో వేయుటయు నతనికంతగా యిష్టములేదు. సంఘసంస్కరణమును