పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
186
మహాపురుషుల జీవితములుములన్నియు స్వపత్రిక లోనే వెల్లడింప వలయునని సత్యప్రకాశిక యను పత్రికను నడపింప నారంభించి మనోరథసిద్ధి చేసికొనియె.

కృష్ణదాసు వార్తాపత్రికను నడపుటకుఁ దగినసామర్థ్యముమన స్వాతంత్ర్యము లోకానుభవముగలవాఁ డగుటచేఁ బత్రిక మంచిదశకు వచ్చెను. హిందువుల సంఘములోఁ జిరకాలమునుండి కాపురముండి బయలుపడకుండ సంఘమును నాశనము చేయుచుండిన దురాచారముల నతడు పత్రికాముఖమున బయలుపుచ్చి యపహాస్యము పాలుచేయుచుండుట చే హిందువు లందఱిలోను ముఖ్యముగా భట్టియాలలోను వైశ్యులలోను మిక్కిలి కళవళము పుట్టెను. బొంబాయిలోనుండు వైశ్యులు భట్టియాలు వాణిజ్యాదులు చేయుటలో బుద్ధిమంతులే యయినను సంఘమత విషయములలో మూర్ఖులయి గురువులకు బానిసలయి వారు గీచినగీటు దాట వెఱచి నీచముగ బ్రతుకుచున్నారు. ఈగురువులు మన దేశమునం దున్న గురువులవలె స్వాములవారలు సన్యాసులని పిలువంబడక మహారాజులని పిలువఁబడుదురు. పేరునకు వారు సన్యాసు లయినను నిజముగా మహారాజులకంటె నెక్కువ భోగములను వైభవములను ననుభవించుచుందురు. ఈ గురువులు శ్రీకృష్ణుని యవతారములని శిష్యజనులునమ్మి భ్రష్టులగుచున్నారు. ఈమతము వల్లభాచార్యమతమని చెప్పఁబడును. ఇదియొక విధమయిన వైష్ణవ మతము, దానిస్థాపకుఁడు వల్లభాచార్యుఁడు. ఈతఁడిప్పటికి రమారమి నాలుగువందల యేండ్లక్రిందట నుండినవాఁడు. ఈయనకొంతకాలము దక్షిణదేశముతిరిగి పిదపఁ బశ్చిమమునకుఁబోయి గుజరాతుదేశమున నొక వైష్ణవమతముస్థాపించెను. ఆమత గురువులే యీమహారాజులు ఈమతసిద్ధాంతమునుబట్టి శిష్యులు గురువునకు తమతనువు మనస్సు ధనము సమస్తము నర్పించి కైంకర్యము చేయవలయును. ఈధర్మము మొట్టమొదట శిష్యులు గురువులయెడల మిక్కిలి భక్తికలిగియుండ