పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
158
మహాపురుషుల జీవితములుగడగడ వడంకి ఆయన చెప్పినచొప్పునఁ జేయుచువచ్చిరి. దక్షిణ దేశమం దార్యసమాజమత మిప్పటికి వ్యాపింపకపోవుటచే దయానందునిపేరు తరుచుగ నీ ప్రాంతములవారికిఁ దెలియదు. గాని యుత్తరహిందూ స్థానమున వాని పేరెఱుఁగనివారు లేరు. ఈయన చరిత్రమును జదివినవా రందఱును ఆయనవలెనె సత్యాదరము దైవభక్తి మొదలగు సద్గుణంబులు కలిగి వర్థిల్లునట్లు దైవ మనుగ్రహించుఁగాక.