పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
150
మహాపురుషుల జీవితములులకుఁ బరాజయము గలిగించెను. ప్రతివాదమందు దయానందుఁడు గెల్చుచుండినను గెలుపొందితి ననుగర్వములేక యోడిపోయిన వారి యెడల బరమదయాళువై మునుపటికంటె నెక్కుడు వినయసంపత్తి చూపుచుండును. అందుచేత నచ్చటికి గ్రైస్తవమతపక్షమునవచ్చిన రెవరెండుస్కాటుదొరగారికి మనస్వామికి నభిప్రాయ భేదములున్నను మైత్రిగలిగెను. పిమ్మట కొంతకాల మక్కడక్కడ తన మతము బోధించి స్వామి 1877 వ సంవత్సరమున ఢిల్లీ పట్టణమున జరిగిన దర్బారును జూడఁబోయి యచ్చోటికి వచ్చిన మహారాజులకు జమీందారులకుం దన సిద్ధాంతము నుప దేశించెను. ఆ మాటల మాధుర్యము జవిచూచి యంతతో దనివినొందక పంజాబు దేశస్థులు తమ దేశమునకు రమ్మని వానిం బ్రార్థించిరి.

వారిప్రార్ధన మంగీకరించి దయానందుడు పంజాబు దేశమునకుఁజని యచట ననేకస్థలములలో నార్యసమాజములను స్థాపించెను. ఎందుచేతనోగాని యీ యార్యమతము పంజాబు దేశమునందు మిక్కిలి యెక్కువవృద్ధిఁబొందెను. సాధారణముగా నా దేశమునం దార్యసమాజములేని గ్రామమేలేదు. పంజాబు దేశమునుండి దయానందస్వామి రాజపుత్రస్థానమునకువచ్చి యుదయపుర మహారాణా వారిచేత ప్రార్థితుఁడయి యానగరమున నెనిమిది మాసములు వసించెను. రాణావా రాకాలములో మనుస్మృతి చదివి రాజ్యతంత్రము నిర్వహించు విధమును నేర్చికొనిరి. రాజుగారిం జూచి యదివఱకెన్నఁడు పుస్తకముఁబట్టి యెఱుఁగని యుద్యోగస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివద్ద చదువ నారంభించిరి. సంస్థాన మంతయుఁ గ్రమ క్రమముగఁ జక్కపడెను. అక్కడనున్న కాలములో రాణా యొకనాడు దయానందునిజూచి స్వామీ! మాయూరిలో గొప్పగోవెలయున్నది. దాని కెన్నియో మాన్యములున్నవి మీరు విగ్రహారాధన మంచిది