పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

మహాపురుషుల జీవితములు

దానముచేసి దానివడ్డీ నింగ్లీషుధర్మశాస్త్రము (లా)ను నేర్పించుటకు వినియోగింపుమని యానితిచ్చెను. అతని కుమారుడు జ్ఞాన మోహన టాగూరు క్రైస్తవుడై యింగ్లాండునకు బోయి బారిష్టరై వచ్చెను. హిందువులలో నతడే మొదటి బారిష్టరు. అతనికి గవర్నమెంటువారు సి. ఐ. ఇ. అను బిరుదమునుగూడ నిచ్చిరి. అతడు 1862 వ సంవత్సరమున మృతినొందెను. ఆతని యోగ్యతనుబట్టి కలకత్తానగరవాసు లాయన జ్ఞాపకార్థము స్ఫటికశిలతో వాని ప్రతి రూపమును జేయించి నిలిపిరి. అది యిప్పటికి నున్నది.