పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
103
రాజేంద్రలాలుమైత్రా

రాజేంద్రుడు వైద్యకళాశాలలోఁ జిరకాలముండ లేదు. అచ్చట విద్యార్థులు కొందరు దుష్ప్రవర్తకులై సంచరించినందున నధికారులు వారి నడతంగూర్చి విచారణ సలిపిరి. ఆరాజేంద్రు డాచెడునడత గల బాలకులలో నొకడు కాడుగాని యాదుర్మార్గులను బట్టియిమ్మని యధికారులు వాని నడిగినప్పుడు తనమిత్రులను బట్టియిచ్చుట కిష్టములేక యతఁ డూరకొనియెను. అది కారణముగ నధికారులు వానిని కళాశాలలోనుండి కొంతకాలము వెడలఁగొట్టిరి. రాజేంద్రుడు మరల నావైద్యశాలకు నధికారులు రానిచ్చినను రాదలపడయ్యె. ఆవైద్య పాఠశాలలో నుండగానే యతఁ డాంగ్లేయభాషలో మంచిసాహిత్యముగల కామరాన్ అను దొరవద్ద నింగ్లీషు చదివి యందు గట్టికృషి చేసెను. యీ కామరాను దొరవద్దనే రాజేంద్రుడు హూణభాష పదములను బ్రయోగించుటలో నిరుపమానమయిన ప్రజ్ఞను సంపాదించెను.

అనంతర మతడు ధర్మశాస్త్రము జదువ నిశ్చయించి న్యాయవాదిపరీక్షకు బోయెను. కాని ఆ సంవత్సరము ప్రశ్నాపత్రములు ముందుగా వెల్లడియగుటచే బరీక్షకులు జరిగిన పరీక్ష నిరర్థకముచేసిరి. అందుచే పరీక్షలో గృతకృత్యుడయితీరవలసిన రాజేంద్రునకు నష్టము సంభవించెను. రాజేంద్రలాలుమైత్రా వైద్యు డగుటకుగాని న్యాయవాది యగుటకుగాని యోగము లేకపోయెను.

పిమ్మట చేయవలసిన దేమియులేక యతం డనేకభాషల జదువుటకు బ్రారంభించెను. అదివరకే వానికి పారశీభాష చక్కగవచ్చును. అప్పటికి సంస్కృతమందు వాని పాండిత్యము కొంచెమై యుండుటచే ముఖ్యమయిన యాభాషలో నధికకృషి చేయుట కతఁడు నిశ్చయించుకొనెను. అదిమొదలు రాజేంద్రుడాభాషలో నధికపాండిత్యము సంపాదించి గొప్పగొప్ప విద్వాంసుల మెప్పువడసెను. గ్రీకు లాటిను భాష