పుట:Mahaakavi dairiilu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

డైరీలు


రుసుం, 10, మందులకు 150, ఆక్సుఫర్డు పుస్తకాలకు 8 రూ||లు, పెళ్ళికి సామానులు కొనేందుకు 23, మొత్తం 211 రూ||లు.

ఇవాళ కోటలో ఫేన్సీడ్రస్ వినోదములు, విందు.

5 జనవరి, శనివారం :

కృష్ణాజిల్లాలోని వీరపల్లి స్టేషనుసమీపాన వొక కొలను కలదు. గట్టుచుట్టూ తుమ్మచెట్లు, యీతచెట్లు. చాలా చెరువులు అలాగునే వున్నవి. రాజమండ్రివద్ద గోదావరి అవతల ఒడ్డున రోడ్డుకిరువంకలా తుమ్మచెట్లకింద "పచ్చికమాసికలు" కనిపించినవి. బెజవాడ సమీపంలో ఎన్నోతుమ్మచెట్లు, పచ్చిక బయలు. ఎంతో ఏపుగా పెరుగుతున్న ఆగడ్డి ఏమిటిచెప్మా! బెజవాడవద్ద సీమచింత మొక్కలవరసలను చూశాను.

9 జనవరి, బుధవారం :

విజయనగరంనుంచి సాయంత్రం ఆరుగంటలకు బయలుదేరాను.

10 జనవరి, లక్ష్మీవారం :

ఉదయం ఆరుగంటలకు రాజమండ్రి వచ్చాను.

11 జనవరి, శుక్రవారం :

ఉదయం ఏడు గంటలకు బెజవాడ బయలుదేరాను. విజయనగరం మహారాజావారి ట్రెయినులో ఎక్కాను.

శ్రీ మోహనురావు చాలా మంచి వ్యక్తి. తన కొడుకును ఎంతో ఆప్యాయంగా ముద్దుముద్దుగా పెంచుతున్నాడు.