పుట:Mahaakavi dairiilu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురజాడ రచనలు

6


కాబోలు, యోచించి కాళ్ళకు కసరత్తు కలిగి పురజనులు దృఢముగా వుండగలుగుటకు ఊళ్ళకు కడుదూరముగా స్టేషనులు వుంచినారు. కొన్నిచోట్ల తునితగువులుకూడ చేయుచు వచ్చిరి. అలమండ స్టేషను వూరికి రమారమీ రెండుమైళ్ళ దూరము; సింహాచల స్టేషను వూరికి మూడు మైళ్ళు. వాల్తేరు స్టేషను త్రిశంకుస్వర్గమువలె వాల్తేరుకు విశాఖపట్నముకు అంటివుండక రెంటికీ యెడమగా వున్నది. విజయనగరంనుంచి అనకాపల్లి వెళ్ళగోరువారు అసావాదిత్యోబ్రహ్మ అని అనకాపల్లి త్రోవవదిలి వాల్తేరు స్టేషనుయాత్రచేసి వొక గంట ఆ స్థలమును సేవించి, తిరిగి వదలిపెట్టి అనకాపల్లి, త్రోవవరకు వెనుకకు త్రొక్కి అక్కడనుండి అనకాపల్లి వెళ్ళేసరికి మధ్యాహ్నము కాగా, ఆ యెండలో వూరికి అద్దెబళ్ళకుగాను బండివారలతో అద్దెనుగురించి పోరాడి, వూరుచేరి మూడుఝాముల లోగా యిన్ని మెతుకులు కడుపులో వేసుకొన్నయడల కృతార్థులని యోచించ తగును.

1895

3 జనవరి, లక్ష్మివారం :

జనవరి నెలకు నాకు రావలసిన అలవెన్సు యిదివరకే షరీపువద్ద పుచ్చుకున్నాను. సోమరాజు బావ నాకు యివ్వవలసిన సొమ్ము పంపించమని ఉత్తరం రాశాను. 10 రూ|| లు నగదు, స్టాంపుకోసం పుచ్చుకున్నది 10 రూ||లు, రిజిష్ట్రేషను