పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


అందుచేత నతఁడు మంచిమార్గమునకు వచ్చి యుక్తాయుక్త విచక్షణత గలిగియుండెను. అతఁడు 'సోక్రెటీసు'ను గురువుగ భావించెను. దైవాధీనమువలన నట్టి గురువు సంప్రాప్తుఁ డయ్యెనని యతఁడు సంతసించెను. సద్గురువులు దొరుకుట దుర్లభము; దొరికినపుడు వారి యనుగ్రహమునకుఁ బాత్రులగుట కష్టతరము. వారి యనుగ్రహము కలిగినపుడు వారియుపదేశముల ననుసరించి నడచుట కష్టతమము. సర్వకాలముల యం దతఁడు గురుసన్నిధానమున వర్తించెను. అతఁ డతనితోఁ గలిసి భోజనము సలిపి యతనితో మల్లయుద్ధము సేయుచుండెను. గురువునుతప్ప తదితరుల నతఁడు లక్ష్యము సేయ లేదు. గురువునకుఁ దెలిసిన యంశము లాకాలములో నెవ్వరికిఁ దెలియవని యతఁ డూహించెను. స్నేహితు లతనిని సన్మార్గము నుండి తప్పింపఁజూచినను గురువున కతఁడు . భయపడి వారి బోధలకుఁ జెవియొగ్గలేదు. ఒక వేళ విషయములకు లోఁబడినను నిప్పుతగిలి యినుముకరఁగి తదుపరి చల్లారి గట్టియగువిధమున 'సోక్రెటీసు'చేత మందలించఁబడి యతఁడు మనోబలము నొందుచుండును.

ఒక రోజున నతఁడు పాఠశాలకుఁ బోయి ప్రాచీనకవియైన 'హోమరు' వ్రాసిన కావ్యము నిమ్మని యుపాధ్యాయుని నడిగెను. అతఁడా గ్రంథము లేదని చెప్పినందున వాని కొక లెంపకాయ వేసి వెళ్లిపోయెను. మఱియొక యుపాధ్యాయుఁ