పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూలియసు సీజేరు

43


మార్చుటకుఁ దగిన సన్నాహము చేసెను. సర్వాధికారియై పేరునకుమాత్రము ' సెనేటు' సభవారిని మంత్రాలోచనలకుఁ బిలుచుచు, సమకట్టిన పనుల నెదురులేక యతఁడు సాగించెను. యుద్ధములలోఁ బ్రజలు విశేషముగ మరణమునొంది. నందుస ప్రజాసంఖ్య దేశములో తగ్గిపోయెను. వివాహము లేక స్త్రీ పురుషులు విచ్చలవిడిగా సంచరించుచుండిరి. అందు చేత వివాహములు చేసికొని కుటుంబములను పోషించు గృహస్థులకు విశేషముగ మన్ననలు కలుగున ట్లతఁడు తీర్మానించెను. 'చంద్రికాసన్నిభస్ఫటికసంఘటితకుడ్యంబులును, కవాట గేహళీవిటంకవాతాయనంబులును, వివిధవిచిత్ర విమానంబులును, నిరంతరసురభికుసుమఫలభరితపాదపమహోద్యానంబులును' కలిగి రోముపట్టణ మతనికాలములోఁ బ్రకాశించెను.

సీజేరు చేసిన మహత్కార్యములలో పంచాంగ (Calender) సంస్కరణ మెక్కుడుగ భావించవలెను. రోమనుల సంవత్సరము చాంద్రమానము ప్రకారము 355 రోజులు కలది. దీనిని సూర్యమానముతో సరిఁజేర్చుటకు ప్రతి మూఁడవ సంవత్సరములో నొక యధిక మాసమును నారు వేసికొనుచుండిరి. ఇటులఁ జేయుచుండినను, సూర్య చంద్రమానములు సరిపడనందున నతఁ డలగ్జాండ్రియా పట్టణములోని ప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్రజ్ఞుఁడగు 'సొసీజనూస'ను వానిని పిలిపించి వానిచేత పతకశుద్ధిని జేయించెను. సంవత్సరమునకు 355 రోజులని గణించుటకు.