పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


బెట్టి, సమయము వచ్చినపు డందఱి సలహాపైని వారు దానిని వాడుకొనుచుండిరి.

వ్యవహారములలో నతఁడు న్యాయముగనుండినను, స్వదేశాభిమానముండుటచేత, గొన్ని పనులలో నధర్మముగ ప్రవర్తింప వలసివచ్చెను. కొన్నిసమయములలో సర్వసమక్షమైన ధర్మములు పక్షము వహించుటచేత నధర్మము లగును. అవి కేవల మధర్మము లని చెప్పలేము. ధర్మ మతిసూక్ష్మము. సంఘమువారి సొమ్ము 'డీలాసు' ద్వీపమునుండి తెచ్చి, 'ఆథెన్సు'పట్టణములో నుంచవలెనని, యథీనియనులు మహాదేశీయుల సభలో ముచ్చటించిరి. అటుల చేయరాదని గ్రీకు లందఱు, చేయవచ్చునని యథీనియనులు; వాదించిరి. అటుల చేసినపక్షమున నథీనియను లా సొమ్ముతో భూ నావికాసైన్యములను బలపఱచి ప్రబలు లగుదురని గ్రీకులు భయపడిరి. అందుచేత వారు కూడదని వాదించిరి. అందఱి సొత్తుగభావింపఁబడినదానిని, యథీనియనులు తమ పట్టణమునకు దీసికొనివచ్చుటకు యత్నించుట యధర్మమైనను, ఆరిస్టైడీసందుల కంగీకరించెను.

విరోధియైన థెమిస్టాకిలీసుని నతఁడు తృణీకరించలేదు; ఇతని సుగుణములనే యెంచెను; పరోక్షమున నితని నెన్నడు నిందించలేదు; ఇతఁడు కష్టములపాలై, దేశోచ్చాటన జేయఁబడి, పరదేశములలోనున్న సమయమున, నితనిని దలఁచు