పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిస్టైడీసు

181


'సలామిసు'వద్ద జరిగిన నౌకాహవములో నథీనియనులకు గ్రీకులకు జయముగలుగునటులఁ జేసిరి.

తదనంతరము, పారసీకులతో పోరాడవలసివచ్చినపు డారిస్టైడీసి డిరువది పటాలములను దీసికొని, స్పార్టనులు మొదలగు గ్రీకులతోఁ బోయి, యుద్ధముజేసెను. ఇదియె 'ప్లెటెయా' యుద్దము. క్రీ. పూ. 488-87 సం|| రములో జరిగెను. ఇందులోఁ బారసీకు లోడిపోయిరి. గ్రీకు లంద ఱతనిని మన్నించిరి.

పారసీకుల దాడికి భయపడి, గ్రీకు లందఱు సమావేశమై, ' దేశసంరక్షణసంఘ'మను పేరున నొక సంఘమును స్థాపించిరి. అందులో, మొదట స్పార్టనులు పెద్దలుగ నుండిరిగాని : వారి గర్వముచేత వారి నందఱు గర్హించి, ఆరిస్టైడీసుయొక్క, సమవర్తనము చేత నతని మూలమున, అథీనియనులను వారు పెద్దలుగాఁ జేసిరి. సంఘమును నిలఁ బెట్టుటకుఁ దగిన సొమ్మును బ్రతివారు నిచ్చుచుండిరి, ఆ యిచ్చుటలో నెచ్చుతగ్గు లుండుటచేత, వారంద ఱారిస్టైడీసును కప్పమును సరి చేయవలసిన దని కోరిరి. అతఁడు న్యాయముగ వారి శక్తికిఁ దగినటుల పన్ను వేసెను. వారందు కంగీకరించి ముదమందిరి. ఎంత గొప్ప పనులను జేసినను, యతఁడు నిరుపేదవాఁడు. ఇటుల సంఘము వారందఱు చెల్లించిన కప్పముసొమ్ము 'డీలాసు' ద్వీపములోఁ