పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x

పీఠిక


వారి నిదర్శనము లనన్యాదృశ్యంబులు; వారి యనుభవములు మనుజుల కనుబోధము; వారి రాకలు మేలురాకలు; వారి సంభాషణలు మోహాంధకారవిదళనచంద్రికలు. వారి సఖ్యము శ్రేయోదాయకము; వారి యుపదేశము శ్రోతవ్యము. వారి సంపర్కము షడ్గుణైశ్వర్య సంధానకరణి. వారు నిర్మలులు, నిష్కళంకులు, నిరాశ్రయులు, నిత్యతృప్తులు, నిరాభాసులు. వారు లక్ష్యైకాగ్రచిత్తులు, సిద్ధసంకల్పులు, మృతజీవులు. వారి యాచరణవిధానముల నుపలక్షించి, తద్విధమున దేశకాలానుగుణ్యముగ గమనించుట మనుజులకు కర్తవ్యంబు.

ఆంధ్రభాషయందు పాశ్చాత్యమహాపురుషజీవితచరిత్రంబులు లోపంబులు. తల్లోపపూరితార్థం బీ మదీయప్రథమోద్యమంబు. ఈ గ్రంథము స్వకల్పనశక్తిశక్తిశూన్యంబు; సరసవచన విరహితంబు. ఈ చరిత్రములు "బుధులకు నవనిధుల దాపురంబును విపులజయలక్ష్మికిఁ గాఁపురంబును" గనుక, మదీయ లోపంబులు సహ్యంబులగుగాక.

ఇంతియకాదు. ఆంధ్ర దేశముననుండు "సకలకళా విభూషితులు శబ్దవిదు ల్నయతత్త్వబోధకుల్ప్రకటకవీంద్రు" లందఱు తమ తమ శక్త్యానుసార మాంధ్ర మాతను "ప్రీతిపూర్వకంబుగాఁ జతుర్విధ శుశ్రూషలు గావించుచు సేవించుచుఁ బూజించుచు భావించుచు నమస్కరించుచు నారాధించు"చున్న సమయంబున, షోడశోపచారపూజావిధానంబు