పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

xi


గుర్తెఱుంగని నేనామెనారాధించుట సమకట్టి, 'పత్ర పుష్పం ఫలం తోయం యోమె భక్త్యాప్రయచ్ఛతి' అనునటుల నామె ప్రసన్నవదనయై సంభావించునని నా భావము. క్లిష్టపండితజనంబుల కామె సంస్తవనం బసంగతంబు. కాళిదాస విరచితంబగు నీ స్తవము నిందుఁ బొందుపఱచుచున్నాఁడను:-

కళ్యాణి - ఖండజాతి - లఘువు.

పల్లవి:- నమో భక్త సురతరు లతే దేవి లలితే,

(1) త్రిపురసుందరి కృపాపాంగ లలితే ||
     చంద్రచూడః ప్రియే చంద్రతిలకాలికే చంద్రముఖి చంద్రి
     కామాందహాసే! కుంద సుందర రదన బంధు జీవాధరే కోటి
     విద్యుల్లతా బృందభాసే ||
                                              నమో భక్త..............||

(2) దరదలిత కమలముకులోచ్చలిత మదకలిత విలసదలి లలితలోచన
      విలాసే! అధర రా గారుణోదయ విధృత దైత్యగురు రుచిరుచి
      ర మౌక్తి కోల్లసితనాసే ||
                                              నమో భక్త...............||

(3) హంసగమనే సకల నిగమ వనశారికే హంసముని హంసమానస
      మరాళే! కంసరిపు సోదరీ కామితార్థప్రదేత్వాంశరణ్యం కాళి
      దాస నరదే ||
                                              నమో భక్త...............||

నా లిఖిత గ్రంథమునుజూచి శాంతముతో సంస్కరించినందుకు, నా గురువులు శ్రీ వేదమూర్తులయిన బ్రహ్మశ్రీ భళ్ల