పుట:Madhavanidanamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవును. తాపమధిక మగును. తొడలయందు నొప్పిపుట్టును. శరీరబలము నశించును. మలమూత్రములు రక్తమునుబోలె ఎఱ్ఱనై యుండును. లేక రక్తముతో కూడి వెడలును. కడుపులో శూలనొప్పి కలుగును. రాత్రి నిదురపట్టక పగటియందధిమముగా నిదురవచ్చును. గుదస్థానము పగులదీయునటుల పోటుబుట్తును. పొత్తి కడుపు లాగినట్టును. కాళ్ళు చేతులు గుంజును. శరీరమున పగుందీయునట్లు బాధ కలుగును. ఎక్కిళ్లు వచ్చును. బాధకోర్వజాలక ఏడ్చును. మూర్చనొందును. రెప్పవాల్చక వికారముగ చూచును. పలువిధముల కూకచిడును.

5.పిత్తముక్కటమై కఫవాతములు తగ్గియుండు సన్నిపాతజ్వరము శీఘ్రకారి యనంబరగు. ఈజ్వరమున ఒడలు మంటబుట్టును. జ్వరవేగము మిక్కిలి తీవ్రమై శరీరమునకు లోభాగమున వెలిప్రక్కను వ్యాపించి వృద్ధినొందును. శీతప్రధానమైన ఉపచారములును, ఔషధములును ఉపయోగించినచో కఫవాతములుకూడ మత్కేటము లగును. దానంజేసి ఎక్కిళ్లు, శ్వాసము, రప్పలార్చుట, వమనివిరేచనములుకూడ నుత్కటిములు కీళ్ళనొప్పి, అసంబద్దమగు మాటలాడుట. శరీరము బరువైయుండుట, కళదప్పుట ఈ లక్షణములన్నియు కల్గును. వాతము శమించుటకై చెమట పుట్టించినచో నాభిస్థానమునందును ఇరుపార్శ్వములయందును ప్రబలమైన నొప్పికల్గును. చెమట వచ్చినపుడు రోమరంధ్రములనుండియు, ముక్కులు, చెవులు, కన్నులు మున్నగు ప్రోతస్సులనుండియు చెమటతోకూడి రక్తము వెలువడును. పైజెప్పిన శూలనొప్పిచే బాధపడునప్పుడు, దప్పియు, తాపంబును అధిక మగును. ఇది మిక్కిలి యతిసాధ్యమైన సన్నిపాతజ్వరము. ఈజ్వరముకల్గిన నొక యహోరాత్రమునకు లోపల రోగి మృతి నొందును. శీఘ్రముగ రోగిని చంపుటం జేసియే ఇయ్యత శీఘ్రకారి యని యస్వర్ధనామముచే బేర్కొనం బడియె.

6. కఫం అధికముగను వాతపిత్తములు కక్కునగను ప్రకుపితములైన సన్నిపాతజ్వరము కప్భణ మనంబరగును. ఇందు చలితోగూడి తీవ్రముగ జ్వరమువచ్చును. గాఢముగ నిదురవచ్చును. శరీరము బరువుగ నుండును. పనులయం దుత్సాహము లేకుండును. మైకము గ్రమ్మును. వాంతి, మూర్చ, దప్పి, అధికలోపము, భుజించిన వానివలె తృప్తి, ఆరోచకము, రొమ్మునొప్పి త: లక్షణములు కల్గును. నోటకఫము నుమియుచుండును. నోరు తీపుగల్గియుండును. చెవులు వినబడకుండును. నోట మాటరాకుండును. కన్నులు గానరాకుండును. అట్టి క్రూరసన్నిపాతమున కఫంబధికమగ ప్రకోపించెనని దాని శమింపజేయదగిన చికిత్సజేసినచో పిత్తముతనకన్న నుత్కటముగ ప్రకోపించి పిత్తోపద్రవములతోగూడి జ్వరమును వృద్ధినొందించును. మరల పిత్తమును శమింప నుపాయముచేసినచో వాతము మిక్కిలి ప్రకోపకము నంది లేనిపోని యుపద్రవముల బుట్టించును. మలములు దోషములు పక్వములగుటకై లంకణము చేసినచో మేధస్సును, అస్ధులను, అస్థులలోనుండు మజ్జి (మూలగ)ను