పుట:Madhavanidanamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వప్నగౌరవాం లన్యతన్ద్రయ:, భర్ది మూర్చా తృషా దాహ తృప్త్యరోచక హృద్ద్రహా:, ష్ఠీవనం ముఖమాధుర్యం శ్రోత్రవాగ్ దృష్టినిగ్రహ:, శ్లేష్మణో నిగ్రహం చాన్యయదా ప్రకురుతే భిషక్. తదా తస్య భృశం పిత్తం కుర్యాత్సోపద్రము జ్వరం, నిగృహీతే తుపిత్తే చ భృశం వాయు: ప్రకుప్యతి. నిరాహరస్య సోంత్యర్ధం మేదో మజ్జాస్థి బాదతే, ఆధాత్ర స్నాతి భుత్తే వాత్రిరాత్రం నహి జీవతి. మేదో గతస్సన్నిపాత: కప్ఫణప్ప ఉదాహృత:, కామాన్మోహాచ్చ లోభాచ్చ భయాచ్చాం యంప్రవర్తతే. మధ్యహీహీనాధికైర్ధోషై: సన్నిపాతో యదా భవేత్, తస్యరోగాస్తఏవోక్తా; ప్రాయో దోషబదాశ్రయా:"

1. వాతపిత్తములు రెండు మత్కటముగ ప్రకుపితములై పిత్తము తక్కువగానుండి కలిగిన సన్నిపాతజ్వరము విభు వనంబరుగు. అట్టిజ్వరముచే పీడితునకు ఒడలంతయు విరుగగొట్టినట్లు నొప్పియు, దప్పియు కలుగును. తాలుపులం ఎండిపోవును. రెప్పలల్లార్చును. కడుపుబ్బరము,అరుచి, మైకము, శ్వాసము, దగ్గు, మతిభ్రమము, శ్రమము కల్గును.

2.పిత్తశ్లేషము లధికములై వాతము హీనముగా నుండి కలిగిన సన్నిపాతము ఫల్గు వనంబడును. ఈజ్వరమునందు శరీరములోపల జ్వరతాపం బధికమై ఒడలిపైని చల్లగనుండును. అట్టిజ్వరము కలవారికి కునుకుపాటు కలుగును. కుడిప్రక్కన సూదుల బొడిచినట్లు పోటు బుట్టును. రొమ్మునందును శిరస్సునందును కంఠమునందును పట్టు పట్టినట్లు నొప్పిగల్గును. కఫముతో గూదిన పిత్తపసరు నోట వెడలుచుండును. దప్పి యధికమగును. కంఠమున తాపము కలుగును. మలము ద్రవముతొ కూడి వెడలును. శ్వాసము వెక్కిళ్లు మిక్కిలి బాధించును. రెప్పలార్చుచుండును.

3.కఫవాతము అధికములై పిత్తము తక్కువగా నుండి కలిగిన సన్నిపాత జ్వరము మకరి యనంబరగు. ఇయ్యది మిక్కిలి దారుణంబైనది. ఇందు చలితొకూడిన జ్వర్ము ప్రబలముగా వచ్చును. ఆకాలమున నిద్ర అధికముగా వచ్చును. తుమ్ము పలుమాఱు వచ్చుచుండును. దప్పి యధికమగును. ఇరుప్రక్కల పట్టినట్లు బాధకల్గును. తల బరువగును. పనులయం దుత్సాహము లేకుండును. వెనుకప్రక్క మెడనరములు ఇటునటు కదలనియ్యక స్తంభించి యుండును. రెప్పలార్చుచుండును. కడుపులో మంటపుట్తును. నడుములయందు నస్తి (మూత్రకోశము) నందును నొప్పి కల్గును.

4.వాతంబధికమై కఫపిత్తములు తగ్గి జనించిన సన్నిపాతజ్వరము విస్ఫురక మనంబదగు. ఇందు దప్పి, తీవ్రమైనజ్వరము, బడలిక ఇవి కలుగును. ఇరుప్రక్కల యందును నొప్పిపుట్టును. దృష్టికి వస్తువులజూచుశక్తి నశించును. వ్రేళ్లు కొంకరులు