పుట:Madhavanidanamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియు నాగంతుకారణము లగు అభిఘాతాదులచే నాకస్మిమముగ గల్గిన రోగములయందు రోగములు జనించునపుడు; ఆక్షణమున దోషసంబంధము లేకున్నను పిదప వాతాదులు ప్రకుపితములై వానికి సంబంధించిన యుపద్రవముల గల్గించును. ఎట్టులన-కత్తిచే నరికినపుడు ఆగంతుకవ్రణము కల్గును. సనుకు సమయమున దోషసంబంధము లేక యున్నను, ఉత్తరక్షణమున వాతాదులు ప్రకోపించి పోటు నొప్పిమున్నగు నుపద్రవముల గల్గించు నని భావము. ఈవిషయమునే చరకాచార్యు నిట్లు చెప్పిరి:- "ఆగంతుర్హి *వృధాపూర్వసముత్పన్నో జఘన్యం వాతపిత్తశ్లేష్మణాం వైషమ్యమాపాదయతి." (చరక.సూ.ఆ.20)

మరియు వాతాది ప్రకోపకారణములు అనంతములు. కావునవానిని నిర్ణయించి చెప్ప నేరికిని శక్యముకాదు. అట్తికరణములను సామాన్యముగ వాగ్భటాచార్యుడు నిదాన స్థానమున సంగ్రహముగ నిట్లు చెప్పెను:- 'తిశ్తోషణకషాయాల్పరూక్ష ప్రమితభోజనై:, ధారణోదీలరణనికాజాగ రాత్యుచ్చభాషణై:. క్రియాతియోగభీశోకచింతావ్యాయామమైధునై: గ్రీష్మాహోరాత్రిభుక్తానే ప్రకుప్యతి సమీరణ: పిత్తం కట్వమ్లతీక్ష్ణోష్ణ పటుక్రోధనిదాహిభి:, శరన్మధ్యాహ్న రాత్ర్యర్ధవిదాహ సమయేషు చ. స్వాద్యమ్లలవణ స్నిగ్ద గుర్వభిష్యందిశీతలై:. ఆస్వాస్వప్ననుఖాజీర్ణ దివాస్వరూప్నాంతిబ్బంహణై:, ప్రచ్చర్ధనద్యయోగేన భుక్త మాత్రవసంతయో:, పూర్వాహ్నే పూర్వారాత్రేచ శ్లేష్మా ద్వంద్వంతు సంకరాత్, మిశ్రీ భావత్సమసానాం సన్నిపాతస్తధా పున:" (ఆ.హృ.ని.అ.1.శ్లో. 14-13) చేదు, కారము, వగరు అను నీరసములు గలపదార్ధముల భుజించినను, మిక్కిలి కొంచెముగ భుజించినను, జిడ్దులేని ప్దార్ధములు తిన్నను నియమకమగుకాలము నతిక్రమించి భుజించినను, మలమూత్రాదులు వెడలనున్నపుడు వానివేగమును నిరోధించినను, వానివేగము లేకుండునపుడు బలాత్కారమగ వాని వెడలించును, రాత్రులయందు నిదురమేల్కాంచినను, మిక్కిలి బిగ్గరగ మాట్లాడినను, వమ్నము, విరేచనము మున్నగు పంచకర్మములను వానివానికి నియతమైన ప్రమాణము నతిక్రమించి అధికముగజేసి కొన్నను, భయబడినను దు:ఖించినను, మనస్సున మిక్కిలి చింతించినను, దేహ పరిశ్రమము నధికముగజేసినను, బలమును అతిక్రమించి సంభోగము జేసినను, ఇట్టి కారణములఛెత వారము ప్రకోము నొందును. మరియు గ్రీష్మకాలమునందును, పగటి చివర (మూడవ)భాగమునను, రాత్రి మూడభాగమునను, భుజించిన హాయారము జీర్ణమైనకాలమునందును వాతము ప్రకోపము నొందును. కారము, పులుపు అను


  • వ్యధాపూర్వ: స్ముత్పన్న: = వ్యధాపూర్వసముత్పన్న: వ్యధాపూర్వాయన్య = వృధాపూర్వ:, అని వ్యుత్పత్తి తెలియదగు.