పుట:Madhavanidanamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చట ప్రధానమును జెప్పినచో దానికి విదుద్ధమైన యప్రధానముగూడ జెప్పినట్లగును గాన ఉద్దేశస్థలమున "దంఖ్యావికల్పప్రాధాన్యబాలకాలనిశేషత:" అని ప్రాధాన్యము మాత్రము నిర్దేశింపబడినది.

బలాబలలక్షణము

హేత్వాదికార్త్స్యానయవై: బలాంబలవిశేషమ్,

వ్యాధిజనించుటకు ఆయావ్యాధిననుసరించి చెప్పబడినహేతువు పూర్వరూపములు రూపము, ఉపశయము అనువానియొక్క సంపూర్ణలక్షణములను కొన్నిటిని బట్టి వ్యాధియొక్కబలమును, బలహీనతను ఎరుంగునది. ఆయావ్యాధికి జెప్పినకారణము అన్నిటిచే వ్యాధికల్గినయెడ వ్యాధి బలిష్టం బనియు, కొన్ని కారణములచే మాత్రము కల్గినయెడ వ్యాధి బలహీన మనియు నెరుంగునది. ఇత్తెరంగుననే ఆయా వ్యాధికి జెప్పియుండు పూర్వరూపరూపలక్షణములన్నియు గాన్ పించి వ్యాధిపుట్టిన నయ్యది బలవత్తర మనియు, అందు కొన్ని మాత్రము గానవచ్చినయెడ స్వల్పబలంబనియు నెరుంగునది. సంతర్పణమునకు జెప్పినవానిని పూర్తిగ నుపయోగించుటచే వ్యాధి శమించినయెడ వ్యాధి బలిష్ట మనియు, కొన్నిటిచేతనే వ్యాధి శమించిన వ్యాధి బలహీనం బనియు నుపశయముచే గూడ నెరుంగునది.

వ్యాధి సంభవిచుసమయమున పైజెప్పిన హేత్వాదుల బలాబలమునుబట్టి సంప్రాప్తి గూడ భిన్నముగ నుండును గాన, సంప్రాప్తినిబట్టి వ్యాధుల బలాబలమును నిర్ణయించునది.

కాలనిర్ణయము

నక్తం దినర్తుభుక్తాంశై: వ్యాధికాలో యధామలమ్

రాత్రి పగలు వసంతాదిఋతువులు భోజనసమయము అని కాలములయొక్క భాగముల ననుసరించి వాతాదిదోషముల కాలముని విభజించి ఆయా వ్యాధులకాలములను నిర్ణయించునది.

వాగ్భటాచార్యుండు వాతాదులకు కాలముల నిట్లు చెప్పెను:- "వయోం హోరాత్రిభుక్తానాం తేంస్తమధ్యాదిగా: క్రమాత్" (అ.హృ.సూ.ఆ.1) మనుజులకు నిర్ణీతమైనవయస్సు, పగలు, రాత్రి, భోజనసమయము అనువానియొక్క అంశమునను, మధ్యమునను, ఆదియందును క్రమముగ వాత-పిత్త-కఫములు మూడును వృద్ధినొందును. (పైజెప్పిన వయస్సు, పగలు, రాత్రి భోజనసమయములను ఒక్కొక్క దానిని మూడుభాగములు జేయ, అందు అంత భాగమున వాతంబును, మధ్యభాగమున పిత్తంబును, ఆదిభాగమున కఫంబును బలముగ నుండు ననిభావము) ఈవాక్యము ననుసరించి రాత్రిని, పగటిని, భోజనసమయమును మూడుభాగములుగ నొక్కక