పుట:Madhavanidanamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములబట్టి యియ్యది రూక్షగుణమునకు సంబంధించిన యుపద్రవమును గల్గించుచున్నది; కావున రూక్షగుణము వృద్ధినొంది వాతము ప్రకోపించినది యనియు, రెండు మూడు గుణముల కృత్యములు గనబడినపుడు ఆయాగుణములచే వృద్ధినొందినది యనియు, వాతమునకి సంబంధించిన గుణములనుబట్టి విభజించుట వికల్పమని నిష్కృష్టార్ధము. అందుఏయేగుణము లధికములై వాతము ప్రకోపించి జ్వరాదుల గల్గించునో ఆయా గుణములకు సంబంధించిన లక్షణములతోగూడి రోగము వ్యాపించును, గాన అట్టి యంశకల్పనముచేత సంప్రాప్తికిగూడ భేదము కల్గు నని భావము. గుణములోని కొన్ని మాత్రము వృద్ధినొందుటకు దానికి నిదానమైన యాహారాదివస్తువుల గుణములు కారణము లగును.

కాషాయ రసమున వాతమునకూ జెప్పిన రూక్షశీతలఘుత్వాదిగుణము లన్నిటిచే వాతము కలవు. కావున కషాయరసమును సేవించినపుడు దూక్షాదిగుణము లన్నిటిచే నాశము ప్రకోపము నొందును. ఇత్తెరంగుననే తక్కినవి యూహింపదగును. పిత్తాదులకు గూడ నిట్టులే యంశకల్పనము జేయందగును.

పైజెప్పిన విషయమును సుశ్రుతుం డిట్లు చెప్పెను. "సర్వైర్భావై స్త్రీభిర్వాసి ద్వాభ్యామేకేన నా పున:, సంసర్గే కుడిత: క్రుద్ధం దోషం దోషాంసుధాల్వతి." (సుశ్రుత. సూ. అ. 21) ఆయా వ్యాధులయందు వారాదిదోషములు చేరినపుడు అన్నిగుణములచేతనైనను లేక ఒకటి-రెండు-మూడు గుణములచేనైనను ప్రకోపించిన దోషము ననుసరించి తక్కినదోషము లుండు నని భావము

ప్రాధాన్యలక్షణము

స్వాతంత్ర్యపారతస్త్ర్యాభ్యాం వ్యాధే: ప్రాధాన్యమాది శేత్.12

జ్వరాదిరోగములయందు నితరవ్యాధులు జేరియున్నపుడు అందు ప్రధానం బెద్ది? అప్రధానం బెద్ది? యను నాశంక కల్గినయెడ స్వతంత్రముగ నుండు వ్యాధి ప్రధానం బనియు నెఱుంగునది.

వ్యాధి సంభవించునపుడు అనేకవ్యాధులు నాక్రమించును. అపుడు స్వతంత్రపర తంత్రక్షణములబట్టి స్వతంత్రమును నిర్ణయించి అది ప్రధానమనియు, వాసి నాశ్రయించి పరతంత్రముగ నుండునది యప్రధానమనియు నెరుంగునది. ఈభేరమునుబట్టి సుప్రాప్తిగూడ బిన్నముగ నుండును. అందు ప్రధానావ్యాధి అనుబంధ్య మనియు, అప్రధాన మనుబంధ మనియు జెప్పనగును. ప్రధానవ్యాధి అనుబంధ్య మనియు, అప్రధాన మనుబంధ మనియు జెప్పనగును. ప్రధానవ్యాధి నెరింగి దానికిదగిన చికిత్స జేసినచో నప్రధానంగువ్యాధియు, ప్రధానముతో గూడ శమించును. అప్రధానమునకు వేరుగ చికిత్స జేయ నవసరములేదు. ఈసౌకర్యమునకే దీని నరయుట యావశ్యకము.