పుట:Madhavanidanamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గల్గిందియా? వాతమున గల్గినదియా? యని సందేహముగ నున్నప్పుడు పిత్తగరములైన యాషధాదుల నుపయోగించునది. అప్పుడు ఆవ్యాధి వృద్ధినొందక శమించినచో నియ్యది పైత్తిక మని నిర్ణయించునది. ఇదియ ప్రయోజనము ఈ విషల్యమునే చరకాచార్యుం డిట్లు చెప్పను:-- "గూఢనిజ్గం వ్యాధిముపయానుపశయాభ్యాం పరీక్షేత" అనువశాయమున గూడ పైజెప్పినవిధముగ నూహించునది.

అనుపశయలక్షణము

విపరీతోం నుపశయో వ్యాధ్యసాత్మాభిసంజ్ఞి త:

పైజెప్పినరీతిగ హేతువ్యాధులకు విపరీతంబులును, విపరీతార్ధకంబులునగు ఔషధాదుల నుపయోగించునపుడు వ్యాధి శమించక వృద్ధినొంద శరీరమునకు కష్టమును గల్గించిన యడ నాయౌషదాదులు అనుపశయ మని చెప్పబడును. ఇదియే వ్యాధికి అసాత్మ్య మనియు చెప్పనగును.

ఉపశయమునకు విరుద్ధమగునది అనుపశాయము కావున నిదియు నుపశయముననే గతార్ధమని తలచి వేరుగ లెక్కిడబడదయ్యె: కావున "విజ్ఞానం పైఇచధాస్మత"

సంప్రాప్తిలక్షణము

యధా దుష్టేన దోషేణ యధా చానువిసర్పతా,
నిర్వృత్తిరామయస్యాసౌ సంంప్రాప్తిర్జాతిరాగతి:.

జ్వరాదిప్రకరణములయందు జెప్పినరీతిగ నాయాపద్దతి ననుసరించి మిధ్యాహారాదులచే దుష్టమై (ప్రకోపమొంది) శరీరమునందని యామాశయాది స్థానముల (ఆయా దోషమునకు జెప్పియుండుప్రకారము) వ్యాపించిన వాతాదులచేత, రోగమునకు జెప్పిన లక్షణములు సంపూర్ణముగ గల్గి, రోగము సంభవించుట సంప్రాప్తి యనబడును. ఇయ్యది జాతి, ఆగరి యను శబ్ధముల వేగుండ నీయాయుర్వేదమునందు జెప్పబడును.

దీని కుదాహరణము:-మిధ్యాహారాదులచేత వాతాదిదోషములు ప్రకోపమునంది యామాశయమున జేరి రసధాతుతోగూడి శరీరమున నుండు కాయాగ్నిని వెడలించును. ఆయాహాగ్ని బైలువెడలి శరీరముపై వ్యాపించి శరీరమునందెల్ల వేడిమి బుట్టించును. దానంజేసి రోమరంధ్రములన్నియు వడ్డగింపబడి చెమ్మట పట్టక శరీరమున సంతాపంబును అవయవములన్నిటియందు నొప్పియు కల్గును. పైజెప్పిన లక్షణము లన్నియు సమకాలమున గల్గిన నయ్యది జ్వర మనబడును. ఇచ్చట దుష్టము లైన వారాదులు పైజెప్పినరీతిద నామాశయమున వ్యాపించి కోష్ఠాగ్నిని వెలికిం