పుట:Madhavanidanamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రోసినప్పుడు పైజెప్పిన సంతాపాదులు సమకాలమున కల్గి శరీరమున వేడి వ్యాపించుటయే జ్వరప్రాప్తి యని యెరుంగునైద్. ఈ సంప్రాప్తి జ్వరప్రకరణమున నిట్లు చెప్పబడినది:- "మిధ్యాహారవిహారాభ్యాం దోషా హ్యామాశయాశ్రయా:, బహిర్నిరస్య కోష్ఠాగ్నిం జ్వరదాస్ప్యారసానుగా:, స్వేదావరోధస్సంతాపస్పర్యాజ్గగ్రహణం శధా, యుగపద్యత్ర రోగేచ స జ్వరో వ్యపదిక్యతే." ఇత్తెరంగుననే తక్కిన వ్యాధ్యుల కెల్ల నాయాప్రకరణమున సంప్రాప్తి నెరుంగునది.

సంప్రాప్తి భేదములు

సంఖ్యావికల్పప్రాధాన్యబలకాలవిశేషత:, సా భిద్యతే యధాత్త్రైవ వక్ష్యంతేం ష్టౌ జ్వరా ఇతి.

పైజెప్పబడిన సుప్రాప్తి, సంఖ్య, వికల్పము, ప్రాధాన్యము, బలము, కాలము అను నైదిటియొక్క విశేషమువలన ననేకవిధములుగ భేదము గల్గియుండును. అందు సంఖ్యావిశేషము జ్వరప్రకరణమున నీగ్రంధమునందే 'అష్టౌజ్వరా:' అని చెప్పబడినది.

అదియెట్టులన:- "జ్వరోంష్టధా వృధగ్ద్వస్థ్వసంఘాతాగంతుజస్స్మృత:" అని జ్వరముయొక్క సంఖ్య నిర్దేశింపబడినది. వార-సిత్త-కఫములచే వేర్వేర్తుగను, రెండేసి దోషముల సంసర్గముచేతను, సన్నిపాతముచేతను, ఆగంతు కారణముల చేతను గల్గుటంజేసి యెనిమిది విధములగును. ఇచ్చట వారికాది జ్వరముల స్ంప్ర్రాప్తియు వేరు వేరుగ నుండును. అందు వాత జ్వర సంప్ర్రాప్తియందు వణుకు, గొంతేండుట, నిదురబట్టకుండుట, గాత్రస్తంభము మున్నగులక్షణములతో గూడి వాతజ్వరము వ్యాపించును. ఇదియు వాతజ్వరసంప్రాప్తి. ఇత్తెరగుననే పిత్తాది జ్వరములసంప్రాప్తి వేరు వేరుగ నుండును. ఇత్తెరంగుననే "సఞ్చా కాసా:; పఞ్చా స్వాసా:, పఞ్చాశ్వాసా:, అష్టౌవుదరాణి" ఇవి మున్నగు స్థలములయందు ఆయాసంఖ్యనుబట్టి వానిసంప్రాప్తియు ననేకవిధముల నుండును.

నికల్పలక్షణము

దోషాణాం సంవేతానాం వికల్పోఒంశాంశకల్పనా,

ఆయావ్యాధులకు సంబంధించి చేరియుండు వారాదిదోషములకు అవి చేయు వట్టి కార్యములచేత వానికి స్వాభావికములగు చూక్ష్మాదిగుణముల విభజిచి నిర్ణయించుటయే వికల్ప మనబడును.

ఎట్టులన--వాతమునకు రూక్షతము, లాఘవము, శైశ్యము, కాఠిన్యము, సూక్ష్మత్వము ననుగుణములు స్వభావసిద్ధములు. వాతము ప్రకోపించునపుడు పైజెప్పిన గుణములలో నొకగుణము వృద్ధినొందియైనను, రెండు మూడుగుణములు వృద్ధినొంది యైనను, అన్నియు సమకాలమున వృద్ధినొందియైనను ప్రకోపించును. అట్టిసమయమున వాతముచేయు పనులలో నేగుణమునకు సంబంధించిన కృత్యములజేయునో అట్టికృత్య