పుట:Madhavanidanamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏల యన "వయో హోరాత్రి భుక్తానాం తేనంతమధ్యాదిగా: క్రమాత్" (అ.హృసూ. ఆ.1) అని చెప్పినప్రకారము వాతపిత్త కఫములు మూడిటికి వరుసగ పైజెప్పిన వయస్సు మున్నగువానిలో అంతమధ్యాది భాగములు మూడును ప్రకోపకారణములు. ఇవి సన్నిహితములగుటంజేసి సన్నికృష్టము అగును.

విప్రకృష్ట మన కాలవ్యవధిచేత కారణ మగునది విప్రకృష్టము--హేమంతఋతువున చయావస్థ (స్వస్థానమునవృద్ధి) నొందిన కఫము వసంతఋతువున ప్రకోపమునొంది కఫరోగముల గల్గించును. దక్షయాగమునం దీశ్వరునకు కల్గినకోపము జ్వరమునకు కారణ మగును. ఇచ్చట కాలాంతరమున కల్గినకారణముచేత కఫరోగంబును, యుగాంతరమున గల్గిన రుద్రకోపముచేత జ్వరమునుకల్గు నని చెప్పుటచేత అట్టి కారణములు విప్రకృష్టము లనబడును.

బలహీనమై రోగమును సమర్ధముగా కుండు కారణము వ్యభిచారి యనదగు. ఈవిషయమును చరకచార్యు డిట్లు చెప్పెను. "దోషా: అబలీయాంసో యదాను జధ్వంతి, న తదా వికారాభినిర్వృత్తిర్భవతి" (చరక. ని. అ.4) బలిష్టములు కాని దోషములు ఎప్పుడు అనుబంధించి యుండునో అప్పుడు రోగములు గల్గ వనుట.

ప్రాధానిక మన రోగములకైనను దోషప్రకోపమున కైనను ముఖ్యమైన కారణము; అయ్యది అసాత్మ్యేనింద్రియార్ధసంయోగము, ప్రజ్ఞాపరాధము, పరిణామము నని మూడు విధములు.

శ్రోత్రము, శ్వక్కు, చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణమునను ఇంద్రియములకుశబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ననునవి వరుసగ విషయములు. ఆవియే యింద్రియార్ధములు. తనకు సుఖకరముగాని యింద్రియార్ధములు అసాత్మ్యేనింద్రి యార్ధములు. అట్టి యసాత్మ్యములగు నింద్రియార్ధములతో కల్గు సంబంధము అసాత్మేనింద్రియార్ధ సంయోగ మనబడును.

ప్రజ్ఞాపరాధ మన వాక్కు, మనస్సు, శరీరము--ఈమూడిటికి సంబందించిన కర్మలు ప్రజ్ఞాపరాధము.

శీతొష్ణవర్షాభేదములైన ఋతుధర్మములతో గూడి సంవత్సరాత్మకమైన కాలము ప్రజ్ఞాపరాధము.

పైజెప్పబడిన ఆసాత్మ్యేనింద్రియార్ధ సంయోగము, ప్రజ్ఞాపరాధము, పరిణామము అను నీమూడును అయోగము, అతియోగము, మిధ్యాయోగము ననుభేదములచేత నొక్కొక్కటి మూడేసివిధము లగును.