పుట:Loochupu-fr.Jojayya.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. మన వ్యక్తిత్వమూ సాంఘికావసరాలూ

పూర్వ వ్యాసంలో మన వ్యక్తిత్వానికి సంబంధించిన మానసికా వసరాలను గూర్చి ముచ్చటించాం. ఈ మానసికావసరాల లాంటివే సాంఘికావసరాలు కూడ కొన్ని వున్నాయి. ఈ వ్యాసంలో సాంఘికావసరాలను గూర్చి విచారించి చూద్దాం.

1. ప్రకాష్, ఆనంద్ కాలేజి విద్యార్ధులు. హాస్టల్లో వుండి చదువు కుంటున్నారు. ఓ సెలవురోజు హాస్టలు విద్యార్థులంతా సయన్సు క్విస్ నడిపించాలి అనుకున్నారు. ప్రకాష్ను పిలిచి క్విస్ ఏర్పాటు చేయమన్నారు. అతన్ని ప్రశంసించి, ఈ పని నీవల్ల అవుతుంది అన్నారు. ప్రకాష్ సంతోషించాడు. ఉత్సాహంగా క్విస్ నడిపించాడు.

అదే హాస్టల్లో మరోదినం రాత్రిపూట భోజనం ముగిశాక కొంతమంది విద్యార్థులు గడ్డి మైదానంలో కూర్చొని కబుర్లు చెప్పకుంటున్నారు. ఆనంద్ కూడా వాళ్లల్లో చేరుదామనుకొని ఆ బృందం దగ్గరకు వెళ్లాడు. కాని వాళ్లు "మేమేదో సొంత విషయం మాట్లాడుకుంటున్నాం" అన్నారు. ఆహ్వానం లభించనందున ఆనంద్ నిరానందంతో అక్కడ నుండి వెళ్లిపోయాడు. నిరుత్సాహంగా తన గదికి తిరిగిపోయి వార్తాపత్రిక చదువుకోవడం ప్రారంభించాడు. ఆనంద్, ప్రకాష్ - ఈ యిద్దరు విద్యార్థుల సంఘటనల్లో భేదం ఏమిటి? ప్రకాష్ ను ఇతరులు అంగీకరించారు. ఆనంద్ ను అలా అంగీక రించలేదు. మనం ఇతరులను అంగీకరిస్తూండాలి. గుర్తిస్తూండాలి. ఇతరులలోని మేలి గుణాలను కొండంతలుగా చేసి కొనియాడుతూండాలి. భర్తృహరి కూడ "పరగుణ పరమాణున్ పర్వతీకృత్య అన్నాడు. విశేషంగా ఇతరులు విజయం సాధించినపుడు వాళ్లను ప్రశంసిసూండాలి. ఈలా యితరులను అంగీకరించినపుడూ అభినందించినపుడూ వాళ్లకు సంతోషం కలుగుతుంది ప్రసిద్ధ రష్యన్ రచయిత మాక్సిం గోర్కిని చాలకాలం చెరలో వుంచారు. “సమాజం నన్ను అంగీకరించకపోవడమే బాధలన్నిటికంటే మహాబాధ