పుట:Lokokthimukthava021013mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

882 కాపు వచ్చినయేడే కరవు వచ్చినది

883 కాలితో నడిస్తే కాశికి పోవచ్చును. తలతో నడిస్తే వాకిలైనా దాటరాదు

884 కార్తె ముందరవురిమినా కార్యంముందు పదిరినా చెడుతుంది.

885 కార్యంగొప్పా వీర్యంగొప్పా

886 కాలమునాటి కందిగింజ పెద్దలనాటి పెసరగింజ

887 కాలమనేది జవము

888 కాలబెట్టి నేలరాచినట్లు

889 కాలమొక్కరీతి గడపవలయు

890 కాలానికి కడగండ్లు దేశానికి తిప్పలు తప్పవు

891 కార్యంనాటి పెండ్లికూతురు

892 కార్యాలకు కరామతులకు ఖర్చుపెట్తినాడుగాని కంచం మార్చి మట్టెలు చేయించలేదు కాలం కలిసిరాకపోతే యేంచేస్తాడు

893 కాలికివేస్తే మెడకు మెడకువేస్తే కాలికి

894 కాలితోచూపితే తలతో చెయ్యాలి

895 కాలినమన్నూ కాలనిమన్నూ అంటవు

896 కాలీకాలని మొండి కట్టె

897 కాలుకడుగ కంచుముంతలేదుగాని, కల్లుకు కళాయిగిన్నె కావలెను

898 కాలుకాలిన పిల్లివలె తిరుగును