పుట:Lokokthimukthava021013mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

861 కాచినచెట్టుకు రాళ్ళదెబ్బలు

862 కాటికి కాళ్లుచాచుకొని తిండికిచెయ్యి చాచేవాడు

863 కాటికిపోయినా కరణాన్ని నమ్మరాదు

864 కాటిలోపండినవి కాకులుతిన్నవి

865 కాదూ అంటే కళతక్కువ ఔనూంటే ఆయుస్సుయెక్కువ

866 కాదూ అంటే అరవ్వాడి చెవ్వి

867 కాదు కాదు అంటే నాదినాది అన్నాడట

868 కానకుండా కట్టెడిచ్చెను గాని విడవకుండా వీరణాలు వాయించెనా

869 కాననివాని పాయసము గంపలాది

870 కానికాలము నకు కర్రే పామవుతుంది

871 కాని కాలమునకు పైబట్ట పక్షులు యెత్తుకపోయినవి

872 కానివాడు లేనివాడితో జత

873 కానిమందం కోటి దు:ఖము

874 కానివాని కొంప కాచి చెరచవలెను

875 కానివేళకు కందులు గుగ్గిళ్ళయినట్లు

876 కానున్నది కాకమానదు

877 కాపు నెనరులేదు, కందికి చమురులేదు

878 కాలంమారి కంచు పెంకు అయినట్లు

879 కాలమందు చేస్తే దేవతలకు ప్రీతి, అకాలమమదు చేస్తే అసురలకు ప్రీతి యిద్దరివాత మన్నుకొట్టు తానన్నాడట

880 కాలము పోవును మాట నిలచును

881 కారణము లేనిదే కార్యముపట్టదు